జానూ.. నువ్వు ఎక్కడ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎస్.జె.ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై సంజీవ్ జాథన్, పవిత్ర జంటగా సురేష్ దర్శకత్వంలో దీపక్ సోహైల్ జిలాని రూపొందించిన చిత్రం ‘జానూ నువ్వెక్కడ’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ, ఓ అందమైన ప్రేమకథతో రూపొందించిన ఈ చిత్రం అందరికీ నచ్చే ఎలిమెంట్స్‌తో రూపొందిందని, ముఖ్యంగా యువత ఆలోచనలకు ప్రతిరూపంగా ఈ చిత్రాన్ని రూపొందించామని తెలిపారు. ప్రేమలో పడడం సులభమైనా ఆ ప్రేమను దక్కించుకోవడం సులభమైన విషయం కాదని, ఇప్పుడొస్తున్న లవ్ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాలకు భిన్నంగా సాగుతూ ఈ సినిమా విజయవంతం అవుతుందన్న నమ్మకముందని తెలిపారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన పాటలను దర్శకుడు సాగర్, రామకృష్ణగౌడ్ విడుదల చేశారని, పాటలన్నిటికీ మంచి ఆదరణ లభిస్తోందని, త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని వారు తెలిపారు. పేరుకు తగ్గట్టుగానే ఈ సినిమాలో పాటలు యువతను ఆకట్టుకుంటాయని, అలాగే చిత్రం కూడా అందరికీ నచ్చుతుందని వారు తెలిపారు. భ్రమిని, రేవంత్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:మురళీ లియోన్, సమర్పణ:కుమార్.బి., నేపథ్య సంగీతం:సురేష్ సబ్‌నే, నిర్మాతలు:దీపక్, సోహైల్ జిలాని, దర్శకత్వం:సురేష్.