పోస్ట్ ప్రొడక్షన్‌లో ప్రేమ సౌధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాజీ మిస్టర్ ఆంధ్రా బాల్వాన్, ప్రాచి అధికారి హీరోహీరోయిన్లుగా మజ్ను సోహ్రబ్ మూవీస్ పతాకంపై మజ్ను రెహానాబేగం మజ్ను సోహ్రబ్ నిర్మాతలుగా ఎస్‌కె మజ్నును దర్శకుడిగా పరిచయంచేస్తూ నిర్మిస్తున్న లవ్ అండ్ హార్రర్ చిత్రం ‘ప్రేమసౌధం’. ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎస్‌ఎంఎం ఖాజా మాట్లాడుతూ.. ఈ చిత్రంలో ఒక ఫైట్, ఆరుపాటలు ఉన్నాయి. పాటలు అద్భుతంగా వచ్చాయి, శివరంజని మ్యూజిక్ ద్వారా ఈనెల 11న పాటలు విడుదల చేస్తున్నాం, ఆగస్టు 9న సినిమాను రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం అని అన్నారు. దర్శకుడు ఎస్.కె.మజ్ను మాట్లాడుతూ.. ఒక చిత్రకారుడి జీవితంలో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్ర కథ రాయటం జరిగింది. అనుక్షణం ఉత్కంఠ భరితంగా సాగుతుంటుంది. సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడిని థ్రిల్‌కు గురిచేస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు కృతజ్ఞతలు అన్నారు. ఇంకా ఈ చిత్రంలో సాయికిరణ్, వౌనిక, సత్యప్రకాష్, కవిత, కోట శంకరరావు, దిల్‌మహేష్, శివ సత్యనారాయణ, మిమిక్రీ మూర్తి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: యాదగిరి, ఎడిటింగ్: సాయిశ్రీనివాస్, ఫైట్స్: సూపర్ ఆనంద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్‌ఎంఎం ఖాజా, నిర్మాతలు: మజ్ను రెహానాబేగం, మజ్ను సోహ్రబ్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం: ఎస్‌కె మజ్ను.