ట్రైలర్‌లో గుప్పెడంత ప్రేమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయిరోణక్, అతిథిసింగ్ జంటగా వినోద్ లింగాల దర్శకత్వంలో ఐవింక్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిన ‘గుప్పెడంత ప్రేమ’ సినిమా ట్రైలర్‌ను బుధవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. దర్శకుడు మధుర శ్రీ్ధర్‌రెడ్డి ట్రైలర్ విడుదల చేసిన అనంతరం మాట్లాడారు. ‘ఇట్స్ మై లవ్‌స్టోరీ’ సినిమాతో వినోద్ తనతో కలిసి పనిచేశాడని, ట్రైలర్ బాగుందని, తప్పకుండా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని అన్నారు. దర్శకుడు వినోద్ మాట్లాడుతూ, గుప్పెడంత ప్రేమకోసం మనిషి ఏదైనా చేస్తాడని, ఇదొక ప్యూర్ లవ్‌స్టోరీ అని, ఈ సినిమా నార్త్ ఈస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో వుంటుందని, మేఘాలయ, చిరపుంజి తదితర ప్రాంతాల్లో చిత్రీకరించామని, అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇదన్నారు. కాశీ విశ్వనాధ్ మాట్లాడుతూ, ఈ సినిమాకు మంచి టైటిల్ పెట్టారని, ఫీల్‌గుడ్ మూవీ ఇదని, అందరికీ నచ్చే చక్కని ప్రేమకథను ఈ చిత్రంలో చూస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో సాయి రోణక్, అతిథి సింగ్, నోయల్ తదితరులు పాల్గొన్నారు.