ఈ నగరంలో విజయోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమా ఫస్ట్ షోనుండి పాజిటివ్ టాక్‌తో ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియాతో ముచ్చటించారు. నిర్మాత సురేష్‌బాబు, దర్శకుడు తరుణ్ భాస్కర్‌తోపాటు చిత్ర నటీనటులు పాల్గొన్నారు. అలాగే కేర్ ఆఫ్ కంచరపాలెం చిత్ర యూనిట్, ఆ చిత్ర దర్శకుడు వెంకటేష్ మహా పాల్గొన్నారు. ఈ చిత్ర పోస్టర్‌ను నిర్మాత సురేష్‌బాబు విడుదల చేసారు. ఈ సందర్భంగా నిర్మాత సురేష్‌బాబు మాట్లాడుతూ... ‘‘ప్రేక్షకులు ‘ఈ నగరానికి ఏమైంది? చిత్రాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. చిత్ర యూనిట్ అందరికీ అభినందనలు తెలుపుతున్నాను. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. దయచేసి సినిమాను పైరసీలో చూడకండి. థియేటర్‌లో చూసి ఆనందించండి. ఈ సమయంలో కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమా పోస్టర్ విడుదల చేయడం ఆనందంగా ఉంది. దగ్గుబాటి రానా ఈ సినిమాను ప్రజెంట్ చేస్తున్నారు. త్వరలో ఈ సినిమా గురించి అన్ని వివరాలు తెలిజజేస్తాం’’ అన్నారు. దర్శకుడు తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ... ‘కొత్త నటీనటుల్ని సపోర్ట్‌చేస్తున్న అందరికీ ధన్యవాదాలు. ఆడియన్స్ నుండి సినిమాకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. సినిమాలో ఎక్కడా అశ్లీలత లేదు. కుటుంబ సభ్యులు అందరు సినిమాను చూసి ఆనందించే విధంగా ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది. ఈ సినిమా చేస్తే మీకు మీ పాత మెమొరీస్ గుర్తుకు వస్తాయి’’ అన్నారు. హీరోయిన్ సిమ్రాన్ చౌదరి మాట్లాడుతూ...‘‘మా సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఆడియన్స్ అందరికీ థాంక్స్. డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌గారికి, నిర్మాత సురేష్‌బాబుగారికి స్పెషల్ థాంక్స్ తెలుపుతున్నాను’’ అన్నారు. హీరోయిన్ అనీషా అంబ్రోస్ మాట్లాడుతూ...‘సినిమా చూసిన అందరు బాగుందని చెబుతున్నారు. ఈ నగరానికి ఏమైంది? సినిమాను ఇంత పెద్ద సక్సెస్‌చేసిన ఆడియన్స్ అందరికీ థాంక్స్. దయచేసి సినిమాను థియేటర్స్‌లో చూడండి. పైరసీని ఎంకరేజ్ చెయ్యొద్దు. పైరసీ లింక్స్ మా మూవీ పేజ్‌కు సెండ్ చెయ్యండి’’ అన్నారు. విశ్వక్ సేన్ మాట్లాడుతూ...‘సినిమా రిలీజ్ అయ్యాక నా ఫ్రెండ్స్ చాలామంది టికెట్స్‌కోసం కాల్ చేస్తుంటే సంతోషంగా ఉంది. తరణ్‌భాస్కర్ కొత్తవారితో సినిమా చేసినందుకు ఆయనకు థాంక్స్ చెబుతున్నాను. కొత్తవారిని సపోర్ట్ చేస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు’ అన్నారు. అభినవ్ గోమతం మాట్లాడుతూ.. ‘ఇంత మంచి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ తరుణ్‌కి, నిర్మాత సురేష్‌బాబుగారికి థాంక్స్. నా పాత్రకు అందరినుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. హిట్‌చేసిన ఆడియన్స్‌కు ధన్యవాదాలు’ అన్నారు.