నవీన్‌చంద్ర చిత్రం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వాతి పిక్చర్స్ బ్యానర్‌లో నవీన్‌చంద్ర, గాయత్రీ సురేష్ హీరోహీరోయిన్లుగా ‘అడ్డా, ఓటర్’చిత్రాల దర్శకుడు జి.ఎస్.కార్తీక్ దర్శకత్వంలో నిర్మాత భార్గవ్ మనె్న నిర్మిస్తున్న చిత్రం బుధవారం పూజా కార్యక్రమాలతో షూటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత భార్గవ్ మనె్న మాట్లాడుతూ.. దర్శకుడు కార్తీక్ మంచి కథ చెప్పారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ అంశాలు పుష్కలంగా ఉండటమే కాకుండా, సరికొత్త పాయింట్‌తో ఈ చిత్రం ఉంటుంది. కష్టపడే టీమ్ కుదిరింది. మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా క్వాలిటీ చిత్రాన్ని మా బ్యానర్ ద్వారా అందిస్తాం అన్నారు. చిత్ర దర్శకుడు జి.ఎస్.కార్తీక్ మాట్లాడుతూ.. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. త్వరలోనే టైటిల్ ప్రకటిస్తాం. టీమ్ అందరి సహకారంతో అందరూ మెచ్చేలా, అందరికి నచ్చేలా ఈ సినిమా ఉంటుంది’ అని అన్నారు. నవీన్ చంద్ర, గాయత్రీ సురేష్, డింపుల్ చొపాడియా, పోసాని కృష్ణమురళి, 30ఇయర్స్ పృథ్వి, అభిమన్యుసింగ్, జయప్రకాష్, గౌతమ్‌రాజు, శివన్నారాయణ, బల్ చిక్ బబ్లూ మొదలగువారు నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, ఆర్ట్ డైరెక్టర్: కిరణ్‌కుమార్ మనె్న, కెమెరా: వెంకట్ గంగాధరీ, ఎడిటర్: జునైద్ సిద్ధికి, నిర్మాత: భార్గవ్ మనె్న, కథ, స్క్రీన్‌ప్లే, మాటల, దర్శకత్వం: జి.ఎస్.కార్తీక్.