‘గూఢచారి’ టీజర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడవిశేష్ ‘గూఢచారి’ సినిమా ఆగస్టు 3న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శశికిరణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా స్పైథ్రిల్లర్ జోనర్‌లో రూపొందుతున్నది. ఈ సినిమా ద్వారా తెలుగమ్మాయి, మోడల్ శోభిత హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తుంది. శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూర్చగా పీపుల్స్‌మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కింది. ఈరోజు హీరోయిన్ సమంత ‘గూఢచారి’ టీజర్‌ను విడుదల చేసారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ... ‘టీజర్ చాలా బాగుంది. సినిమా హై బడ్జెట్‌లో తీసినట్లు రిచ్‌గా ఉంది. ఈ సినిమా టీజర్‌ను లాంచ్ చెయ్యడం హ్యాపీగా ఉంది. క్షణం సినిమా లాగే ఈ మూవీ పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా. అందరిలాగే ఈ సినిమాకోసం నేను వెయిట్ చేస్తున్నా’ అన్నారు. అడవిశేష్ మాట్లాడుతూ...‘డైరెక్టర్ శశి ఈ సినిమాను గొప్పగా తెరకెక్కించారు. విజువల్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. 168 లొకేషన్స్‌లో ఈ సినిమాను తీయడం జరిగింది. మంచి బడ్జెట్ ఇచ్చి మాకు సహకరించిన నిర్మాతలకు థాంక్స్. మా టీజర్‌ను రిలీజ్ చేసిన సమంతకు స్పెషల్ థాంక్స్. గూఢచారి సినిమా ప్రేక్షకులకు థ్రిల్ చెయ్యబోతోంది’’ అన్నారు. డైరెక్టర్ శశి మాట్లాడుతూ.. ‘గూఢచారి సినిమా చెయ్యడానికి సహకరించిన నిర్మాతలకు, టెక్నీషియన్స్‌కు కృతజ్ఞతలు. సినిమా బాగా వచ్చింది. టీజర్‌కు మంచి రెస్పాన్స్ లభిస్తుంది’ అన్నారు. అబ్బూరి రవి మాట్లాడుతూ... అడవి శేష్ అందరితో బాగా వర్క్ చేయించుకున్నారు. డైరెక్టర్ శశి చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. సెకండ్ హాఫ్‌లోని విజువల్స్ ప్రేక్షకులను అలరిస్తాయి’ అన్నారు. నిర్మాత అభిషేక్ నమ మాట్లాడుతూ... 160 డేస్‌లో సినిమాను చిత్రీకరించాం. కథ, కథనాలు ఆడియన్స్‌కు నచ్చే విధంగా ఉంటాయి. నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ... ‘అడవిశేష్‌కు ఈ సినిమా మైల్‌స్టోన్ సినిమా అవుతుందని నమ్ముతున్నాను. గూఢచారి టీజర్ బాగుంది. చిత్ర యూనిట్ పడిన కష్టం టీజర్ చూస్తుంటే తెలుస్తుంది. సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. చిత్ర యూనిట్ సభ్యులకు అభినందనలు తెలుపుతున్నాను’ అన్నారు. అడవిశేష్, శోభిత దులిపాళ్ల, ప్రకాష్‌రాజ్, మధుషాలిని, అనిష్‌కురివెల్ల, సుప్రియ యార్లగడ్డ, వెనె్నల కిషోర్, రాజేష్ వర్రి తదితరులు నటిస్తున్నారు.