అందరికీ నచ్చిన సంజీవని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనోజ్‌చంద్ర, అనురాగ్ దేవ్, శే్వత వర్మ, తనూజ, అమోగ్, నితిన్, మోహన్ ప్రధాన పాత్రధారులుగా రవి వీడే దర్శకత్వంలో నివాస్ క్రియేషన్స్ పతాకంపై జి.నివాస్ నిర్మించిన చిత్రం ‘సంజీవని’. ఇటీవల విడుదలైన ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తున్న నేపథ్యంలో సక్సెస్ మీట్‌ను ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా దర్శకుడు రవి వీడే మాట్లాడుతూ- సినిమాకు విశేష స్పందన లభిస్తోంది. 87 థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇపుడు వందకుపైగా థియేటర్లలో ఆడుతోంది. థియేటర్లు పెరగడమే మా చిత్ర విజయానికి ఉదాహరణ. సినిమా చూసినవారంతా హాలీవుడ్ తరహాలో వుందంటూ ప్రశంసిస్తున్నారు. తక్కువ బడ్జెట్‌లో ఇలాంటి సినిమా తీయడం అసాధ్యం. కానీ మేం దాన్ని చేసి చూపించాం. ఓపెనింగ్ ఎపిసోడ్‌ను కేవలం 15 లక్షల్లో పూర్తిచేస్తాం. అలా ఎవరు తీయలేరు. ఇలాంటి చిత్రాలకు ఇదొక ట్రైలర్. మా చిత్ర ట్రైలర్ చూసి రాజవౌళి, రాంగోపాల్‌వర్మ వంటి దర్శకులు ట్వీట్ ద్వారా ప్రశంసించారు. వారికి థాంక్స్. మా ప్రయత్నాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఆడియెన్స్ కోసం ఓపెనింగ్ ఎపిసోడ్‌ను యూ ట్యూబ్‌లో విడుదల చేస్తున్నాం అన్నారు. మూడు రోజుల్లోనే కోటి 25 లక్షలు వసూలు చేసింది. మరో నాలుగు వారాలు సినిమా ఆడుతుందని నమ్ముతున్నాం అని బాపినీడు తెలిపారు.