ఎన్టీఆర్ కోసం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్న నందమూరి తారకరామారావు జీవిత కథతో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ సినిమా నేటి నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్న విషయం తెలిసిందే. నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ పోషిస్తోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ భార్య పాత్రలో బాలీవుడ్ భామ విద్యాబాలన్ నటిస్తున్న విషయమూ తెలిసిందే. ఈ సినిమా కోసం ఆమె ఈరోజు ముంబై నుండి హైదరాబాద్ చేరుకున్నారు. ఈనెల 5 నుండి మొదలయ్యే షూటింగ్‌లో ముందుగా విద్యాబాలన్‌కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తారట. ఇక బాలకృష్ణ రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి.. విద్యాబాలన్‌తో కలిసి ఉండే సన్నివేశాలను తరువాత తెరకెక్కిస్తారట. విద్యా బసవతారకంగా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. నందమూరి బాలకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేస్తారట.