తేజ్ పెద్ద హిట్ అవుతుంది -- అల్లు అరవింద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుప్రీమ్ హీరో సాయిధరమ్‌తేజ్ కథానాయకుడిగా, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్‌గా క్రియేటివ్ కమర్షియల్స్ మూవీ మేకర్స్ పతాకంపై ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో క్రియేటివ్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు నిర్మించిన చిత్రం ‘తేజ్’... ఐ లవ్‌యు అనేది ఉప శీర్షిక. ఈ సినిమా ఈనెల 6న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ.. ‘‘20 ఏళ్లుగా కరుణాకరన్‌గారు లవ్ మెజీషియన్‌గా ఉండి ప్రేమకథా చిత్రాలే చేస్తూ మమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తూ వచ్చారు. మాకెన్నో బ్యూటీఫుల్ మూవీస్ ఇచ్చారు. నా కెరీర్‌లో ఓ ఇంపార్టెంట్ మూవీని కరుణాకరన్‌గారు డైరెక్ట్‌చేస్తే కె.ఎస్.రామారావుగారు నిర్మించారు. ఇదొక బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియెన్స్. ప్రతిరోజూ ఎంజాయ్ చేస్తూ సినిమా చేశాను. మాకు సపోర్ట్ ఇచ్చిన కె.ఎస్.రామారావుగారికి థాంక్స్. ఆయన మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. డెఫినెట్‌గా సినిమా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు. చిత్ర నిర్మాత కె.ఎస్.రామారావు మాట్లాడుతూ.. ‘‘నేను రేడియో సిటీలో పబ్లిసిటీ చేస్తున్న సమయంలో రేడియో రామారావుగా అందరికీ పరిచయం ఉండేది. ఆ సమయంలో గొప్ప నిర్మాతలైన అశ్వనీదత్, అల్లు అరవింద్‌గారితో పరిచయం ఉండేది. అంత గొప్ప నిర్మాతల స్థాయి కాకపోయినా వారితో ఈ వేదిక పంచుకునే స్థాయి రావడం నా అదృష్టం. నా కంపెనీలో సినిమాలు చేసిన దర్శకులు, హీరోల వల్లనే నేను ఈ గొప్ప స్థితికి వచ్చాను. అశ్వనీదత్‌గారి సినిమాలను చూసి ఇంత గ్రాండ్‌గా సినిమాలు ఎలాచేస్తారో? అనుకుంటూ రేడియో పబ్లిసిటీ చేస్తూ ఆయనతో ట్రావెల్ చేశాను. మాకంటే చిన్నవాడైన అశ్వనీదత్‌గారు పెద్ద హీరోలైన ఎన్టీఆర్‌గారితో సినిమాలు చేశారు. ఆయన చేసే సినిమాల స్థాయి చూసి మేం ఆశ్చర్యపోయేవాళ్లం. ఆయన సినిమాలను అబ్జర్వ్ చేస్తూ కొంత నేర్చుకున్నాను. అలాగే అరవింద్‌గారి ప్లానింగ్ చాలా గొప్పగా ఉంటుంది. ఎక్కడా దుబారా కాకుండా సినిమాలు చేస్తారు. అలా ఆయన సినిమాలను అబ్జర్వ్‌చేయడం జరిగింది. అరవింద్‌గారు ఇంత సీనియర్.. ఇప్పుడు సోల్జర్స్ లాంటి నిర్మాతలను తయారుచేస్తున్నారు. ఆయన పెద్ద సైన్యాన్ని తయారుచేసుకుంటూ వస్తున్నారు. చిరంజీవిగారు చాలా గొప్పగా నిలదొక్కుకున్నారంటే ఫౌండేషన్ ప్లాన్ చేసిన వ్యక్తి అరవింద్‌గారు. ఇప్పుడు మెగా ఫ్యామిలీనుంచి 11 మంది హీరోలున్నారు. కానీ అందరూ క్రమశిక్షణతో ఉన్నారంటే కారణం అరవింద్‌గారి ప్లానింగే. అరవింద్‌గారు మాకెవరికీ అంతుపట్టని ప్లానింగ్ చేస్తారు. ఈ సినిమా చేయడానికి ప్రధాన కారణం సాయిధరమ్‌తేజ్. సినిమా చాలాబాగా వచ్చింది. కరుణాకరన్‌గారు సినిమా చేయడమేకాదు.. మ్యూజిక్ విషయంలో కూడా దగ్గరుండి కేర్ తీసుకున్నాడు. మా సినిమాకు పనిచేసిన డార్లింగ్ స్వామి, గోపీసుందర్, అండ్రూ అందరికీ థాంక్స్’ అన్నారు. ఎ.కరుణాకరన్ మాట్లాడుతూ.. ‘తొలిప్రేమనుండి ఈరోజు వరకు నేను చేసిన ఈ ప్రయాణంలో నా హీరోలు, నిర్మాతల ఎంతగానో సపోర్ట్ చేశారు. వారు లేకుంటే నేను లేను. చాలా ఎమోషనల్‌గా ఉంది. తక్కువ సినిమాలే చేసినా.. పెద్ద పెద్ద నిర్మాతలతో పనిచేశాను. నేషనల్ అవార్డ్ తీసుకున్నప్పుడు ఎంత ఆనందంగా ఉందో ఇప్పుడు అంతే ఆనందపడుతున్నాను’’ అన్నారు.