సత్యదేవ్ హీరోగా బ్లఫ్ మాస్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆశ, అత్యాశల నేపథ్యంలో రూపొందిన ‘చతురంగ వేట్టయ్’ చిత్రానికి తమిళ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడీ చిత్రం తెలుగులో రీమేక్ అయ్యింది. అభిషేక్ ఫిలిమ్స్ అధినేత రమేష్ పిళ్లయ్ ఈ చిత్రానికి నిర్మాత గోపీగణేష్ పట్ట్భా దర్శకుడు. ‘జ్యోతిలక్ష్మి’, ‘ఘాజి’ చిత్రాల ఫేమ్ సత్యదేవ్ హీరోగా నటించారు. ‘ఎక్కడికిపోతావు చిన్నవాడా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నందితాశే్వత ఇందులో నాయిక. ఈ సినిమా గురించి నిర్మాత రమేష్ పిళ్లయ్ మాట్లాడుతూ.. ‘‘తొలిసారిగా అభిషేక్ ఫిలిమ్స్ పతాకంపై లారెన్స్ నటించిన శివలింగ తమిళ చిత్రాన్ని తెలుగులో అనువదించి మంచి విజయాన్ని సాధించాం. తమిళంలో ఘన విజయాన్ని సాధించిన చిత్రం ‘చతురంగ వేట్టయ్’ని తెలుగులో రీమేక్ చేశాం. చిత్రీకరణ పూర్తయింది. కొడైకెనాల్, కర్నూలు, వైజాగ్, హైదరాబాద్‌లో చిత్రీకరణ జరిపాం. ఎక్కడా రాజీపడకుండా హైటెక్నికల్ వేల్యూస్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. పాటలను ఈ నెలాఖరున, చిత్రాన్ని ఆగస్ట్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ప్రతి ఒక్కరికీ కనెక్ట్‌అయ్యే సినిమా ఇది’అని అన్నారు. దర్శకుడు గోపీ గణేష్ పట్ట్భా మాట్లాడుతూ.. ‘‘రోజూ ఏ దినపత్రిక చదివినా, ఏ టీవీ ఛానల్ చూసినా 90 శాతం మోసాల గురించే ఉంటాయి. మనిషికి ఆశ సహజం. కానీ అది అత్యాశగా మారినప్పుడే ఘోరాలు, నేరాలు జరుగుతాయి. అత్యాశ ఉన్న ప్రతిచోటా ఒక బ్లఫ్‌మాస్టర్ ఉంటాడు. ఆ నేపథ్యంలోనే ఈ సినిమా ఉంటుంది. బ్లఫ్‌మాస్టర్‌గా సత్యదేవ్ అదరగొట్టేశాడు. ఈ సినిమాలో ప్రతి పాత్ర చాలా లైలీగా ఉంటుంది’ అని చెప్పారు. ఆదిత్యామీనన్, పృథ్వి, బ్రహ్మాజీ, సిజ్జు, చైతన్యకృష్ణన్, ధన్‌రాజ్, శ్రీరామరెడ్డి, వేణుగోపాలరావు, ఫిష్ వెంకట్, బన్నీ చందు, ‘దిల్’ రమేష్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కథ: హెచ్.డి.వినోద్, అడిషనల్ డైలాగ్స్: పులగం చిన్నారాయణ, సంగీతం: సునీల్ కావ్యప్, ఎడిటర్: నవీన్ నూలి, ఆర్ట్: బ్రహ్మకడలి, కెమెరా: దాశరథి శివేందర్, కోడైరెక్టర్: కృష్ణకిశోర్, నిర్మాత: రమేష్ పిళ్లయ్, మాటలు-దర్శకత్వం: గోపీగణేష్ పట్ట్భా.