ఆగస్టు 9న శ్రీనివాస కళ్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నో సూపర్ డూపర్ హిట్ కుటుంబ కథాచిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ గత ఏడాది డబుల్ హ్యాట్రిక్స్‌తో ఈ నిర్మాణ సంస్థ సరికొత్త రికార్డ్‌ను క్రియేట్ చేసింది. ఇలాంటి నిర్మాణ సంస్థలో రూపొందుతోన్న చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం’. జీవితంలో పెళ్లి విశిష్టతను ఈ సినిమా ద్వారా తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. 14 ఏళ్లక్రితం హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, యువ హీరో నితిన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘దిల్’ సినిమా సెనే్సషనల్ హిట్ అయ్యింది. చాలా గ్యాప్ తర్వాత ఈ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో ఈ సినిమా తెరకెక్కనున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘శ్రీనివాస కళ్యాణం’. గత ఏడాది జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రజాదరణ పొందిన ‘శతమానం భవతి’ చిత్రాన్ని రూపొందించిన డైరెక్టర్ సతీశ్ వేగేశ్న ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ.. ‘ఒక సాంగ్ కొంత ప్యాచ్‌వర్క్ మినహా సినిమా చిత్రీకరణంతా పూర్తయ్యింది. మిగిలిన షూటింగ్ పార్ట్‌ను, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను త్వరలోనే పూర్తిచేసి ఆగస్ట్ 9న ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. 12 సంవత్సరాల క్రితం ఇదే ఆగస్ట్ 9రోజున బొమ్మరిల్లు విడుదల అయింది. మళ్ళీ అదేరోజున అదే స్థాయి విజయాన్ని ‘శ్రీనివాస కళ్యాణం’తో అందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం’అని చెప్పారు. నితిన్, రాశీఖన్నా, నందితాశే్వత, ప్రకాష్‌రాజ్, రాజేంద్రప్రసాద్ తదితరులు ముఖ్యతారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: రామాంజనేయులు, ఎడిటింగ్: మధు, సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్: బండి రత్నకుమార్, సంగీతం: మిక్కీ జె.మేయర్, నిర్మాణం: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వేగేశ్న సతీష్.