దేవదాస్‌గా నాగ్ - నాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కినేని నాగార్జున - హీరో నాని కలసి నటిస్తున్న సినిమా షూటింగ్ జోరుగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఓ ఆసక్తికర టైటిల్ పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ టైటిల్ ఏమిటో తెలుసా.. దేవదాస్. అక్కినేని నాగేశ్వరరావు కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ చిత్రం. ఇపుడు ఈ సినిమాకు ఈ టైటిల్ పెట్టడంపై అటు అక్కినేని ఫాన్స్ కూడా షాక్ అవుతున్నారట. అంత మంచి టైటిల్‌తో చేస్తున్న సినిమా కాబట్టి ఎక్కడైనా తేడా కొడితే ఆ పేరు చెడగొట్టినట్లవుతుంది అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే దేవదాస్ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా జోనర్ వేరే. ఇందులో నాగార్జున డాన్‌గా కనిపిస్తే.. నాని డాక్టర్ పాత్రలో నటిస్తున్నాడు. నాగ్ పేరు దేవ్.. నాని పేరు దాస్ అని, అందుకే ఈ సినిమాకు దేవదాస్ అన్న టైటిల్ పెడుతున్నారట. మొత్తానికి ఆ సినిమాకు ఈ సినిమాకు పోలిక లేదు. ఇక దేవదాస్ లాంటి క్రేజీ టైటిల్‌తో తెరకెక్కే ఈ సినిమాను దసరాకు ప్లాన్ చేస్తున్నారు. అక్కినేని సావిత్రిల జోడీతో తెలుగు దేవదాస్ ఓ సంచలన విజయాన్ని అందుకుంది. ఇదే టైటిల్‌తో సూపర్‌స్టార్ కృష్ణ, విజయనిర్మల ప్రయత్నం చేశారు కానీ ఆశించిన విజయాన్ని అందుకోలేదు. ఇక హిందీలో దిలీప్‌కుమార్, షారుఖ్‌ఖాన్ చేసి ఓ రేంజ్ ఇమేజ్ తెచ్చుకుని పాత్రలో జీవించారు.