13న ప్రేమికుడు పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానస్, సనమ్ శెట్టి జంటగా ఎస్.ఎస్. సినిమాస్ పతాకంపై కళాసందీప్ దర్శకత్వంలో లక్ష్మీనారాయణ రెడ్డి, ఇసనాక సునీల్ రెడ్డి రూపొందిస్తున్న చిత్రం ‘ప్రేమికుడు’. ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, ఈ చిత్రం టీజర్‌ను ఇటీవల విడుదల చేశామని, యువతలో మంచి ఆదరణ లభించిందని, ఓ అందమైన ప్రేమకథతో అందరికీ నచ్చేలా రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన పాటలను ఈనెల 13న విడుదల చేయనున్నామని తెలిపారు. సంగీతం హైలెట్‌గా నిలిచే ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని వారు తెలిపారు. పరుచూరి వెంకటేశ్వరరావు, భానుచందర్, అనితాచౌదరి, షకలక శంకర్, అజీజ్ నాజర్, సన తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:శివ.కె, ఎడిటింగ్:కేరింత మధు, సంగీతం:విజయ బాలాజి, నిర్మాతలు:లక్ష్మీనారాయణరెడ్డి.కె., ఇసనాక సునీల్‌రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:కళాసందీప్.