తనయుడితోనే పూరి సినిమా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 5 July 2018
వరుస పరాజయాలతో టెన్షన్ మీదున్న పూరి జగన్నాథ్ తన ప్లాఫ్లకు ఫుల్స్టాప్ పెట్టాలని ఆయన తనయుడు ఆకాష్తో మెహబూబా తీశాడు. భారీ అంచనాల మధ్య అది కూడా ఇండో-పాక్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ ప్లాఫ్ అయింది. దాంతో పూరి పని అయిపోయిందని... ఆయనతో సినిమాలు చేయడానికి ఏ హీరో సుముఖంగా లేడని వార్తలు వస్తున్నాయి. దాంతో పూరి ఇక బయటి హీరోతో ప్రయత్నాలు చేయడం కంటే మళ్లీ తన కొడుకుతోనే సినిమాకు సన్నాహాలు చేస్తున్నాడట. ఇప్పటికే ఈ సినిమాకోసం కథను సిద్ధం చేస్తున్నాడట పూరి. పైగా ఈ సినిమాకు నిర్మాత కూడా ఆయనేనట. తన కొడుకును హీరోగా నిలబెట్టి దర్శకుడిగా మళ్లీ తన సత్తా ప్రూవ్ చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమా పట్టాలు ఎక్కనుందట.