‘జిగేల్’ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కథ’ చిత్రంతో కథానాయకుడిగా తెలుగు చిత్రసీమకు పరిచయమైన అరుణ్ ఆదిత్ ఇటీవల ‘పి.ఎస్.వి.గరుడవేగ’ చిత్రంలో కీలక పాత్ర పోషించి నటుడిగా అందరినీ మెప్పించాడు. ప్రస్తుతం తెలుగులో హీరోగా రెండు సినిమాల్లో నటిస్తూ బిజీగాఉన్న అరుణ్ ఆదిత్ నటిస్తున్న తాజా చిత్రం ‘జిగేల్’. శ్రీ ఇందిరా కంబైన్స్ పతాకంపై అల్లం నాగార్జున నిర్మాణ సారథ్యంలో నిర్మాణమవుతున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. అరుణ్ ఆదిత్ సరసన ‘జంబ లకిడి పంబ’ ఫేమ్ సిద్ధిఇద్నానీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ఏలూరి మల్లి దర్శకత్వం వహిస్తున్నారు. నేటినుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకొంటున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం చిత్ర బృందం సమక్షంలో లాంఛనంగా జరిగింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అల్లం నాగార్జున మాట్లాడుతూ.. ‘‘్భరీ తారాగణంతో మంచి బడ్జెట్‌తో తెరకెక్కనున్న హైక్వాలిటీ చిత్రం ‘జిగేల్’. కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. అరుణ్ ఆదిత్ ఈ పాత్రకు పర్‌ఫెక్ట్‌గా సరిపోతాడు’’ అన్నారు. జయప్రకాష్‌రెడ్డి, ఆశిష్ విద్యార్థి, పోసాని కృష్ణమురళి, సత్య, సత్యం రాజేష్, రఘుబాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వాసు, సంగీతం: మంత్ర ఆనంద్, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర్రావు.