ఎన్టీఆర్ బయోపిక్ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహనీయుడు ఎన్టీఆర్ బయోపిక్ చిత్ర షూటింగ్ ఈరోజు ప్రారంభమైన సందర్భంగా ఈరోజును చారిత్రాత్మక రోజుగా పరిగణించవచ్చు. ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కబోతున్న ఎన్టీఆర్ సినిమాలో నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్‌లో కనిపించబోతున్నారు. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ గురువారం ప్రారంభం అయ్యింది. స్వర్గీయ నందమూరి తారక రామారావు తన మొదటి సినిమా రంగ ప్రవేశం ‘మనదేశం’ సినిమాతో జరిగింది. మనదేశం సినిమా చిత్రీకరణలో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ బాలకృష్ణ చెప్పారు. ఈ సీన్‌ను ఎన్టీఆర్ బయోపిక్ కోసం షూట్ చేశారు. ఎన్టీఆర్ పోషించిన పోలీస్ ఇన్స్‌పెక్టర్ పాత్రలో బాలకృష్ణ నటించడం విశేషం. అభిమానులను ఉద్దేశించి ఎన్టీఆర్ స్వయంగా 1975లో ఒక ఉత్తరం రాయడం జరిగింది. ‘అభిమానమును మించిన ధనము, ఆదరమును మించిన పెన్నిధి ఈ లోకమున లేదు. ఇందరి సోదరుల ప్రేమానురాగములను పంచుకోగలుగుట ఈ జన్మకు నేను పొందిన వరం. మీకు సదా రుణపడ్డట్టే. నాడు నేడు ‘మనదేశం’తోనే చరిత్రకు శ్రీకారం. నా శుభకాంక్షలు, సోదరుడు రామారావు’ అని ఎన్టీఆర్ రాసిన ఉత్తరాన్ని నందమూరి బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా వారు తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు కోరుకున్నారు. ‘మనదేశం’ చిత్ర సీన్స్‌తో షూటింగ్ మొదలుపెట్టినట్లు బాలకృష్ణ, క్రిష్ తెలిపారు. ఈ చిత్రంలో విద్యాబాలన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.కీరవాణి, కెమెరా: వి.ఎన్.జ్ఞానశేఖర్, నిర్మాతలు: సాయి కొర్రపాటి, విష్ణు ఇందురి, దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి.