సిద్ధమవుతున్న ‘చి ల సౌ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుశాంత్ నటించిన ‘చి ల సౌ’ సినిమాతో హీరో రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారారు. రుహాని శర్మ హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. చిలసౌ సినిమా కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్, సిరుని సినీ కార్పొరేషన్‌తో అనుబంధం ఏర్పరచుకుంది. అన్నపూర్ణ సంస్థ ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. ఇటీవల విడుదలైన చిలసౌ చిత్ర టీజర్‌కు మంచి స్పందన లభించింది. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది. ప్రశాంత్ విహారి ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రంలో సుశాంత్, రుహానీ శర్మ, వెనె్నల కిశోర్, జయప్రకాష్, సంజయ్ స్వరూప్, రోహిణి, అనుహాసన్, రాహుల్ రామకృష్ణ, విద్యురామన్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటర్: చోటా కె ప్రసాద్, కెమెరామెన్: ఎం.సుకుమార్, సంగీతం:ప్రశాంత్ ఆర్ విహారి, నిర్మాత: జస్వంత్ నడిపల్లి, భరత్ కుమార్ మలశాల, హరి పులిజల, దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్.