ప్రేమలో సంజన?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటిస్తూ వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటున్న కన్నడ భామ సంజన ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు టీవీ సీరియల్‌లో కూడా నటిస్తోంది. తాజాగా ఆమె నటించిన స్వర్ణఖడ్గం త్వరలో టీవీలో ప్రసారం కానుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ అమ్మడు స్పందిస్తూ, తానూ ఓ వ్యక్తితో ప్రేమలో పడ్డానని చెప్పింది. ఓ హీరోయిన్ ఇలా తాను ప్రేమలో ఉన్నానని చెప్పడం నిజంగా సినిమా ప్రేక్షకులకు కాస్త షాకిచ్చే విషయమే. ఎందుకంటే చాలామంది హీరోయిన్స్ ప్రేమాయణాలు సాగిస్తున్న విషయం బయటికి వచ్చాకా, మీరు ప్రేమలో పడ్డారట కదా అంటే.. అయ్యో నేను ప్రేమలో పడడం ఏమిటి.. జస్ట్ ఫ్రెండ్స్.. అంతే అని దాటవేస్తున్న సంగతి తెలుసు. అలాంటిది ఈ అమ్మడు ఇలా డైరెక్టుగా చెప్పడం కాస్త షాకిచ్చే విషయమే. అయితే ఈమె ఏ హీరోతో ప్రేమలో పడింది? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఆమె ప్రేమలో పడింది హీరోతో కాదు ఓ డాక్టర్‌తో. అవును.. బెంగుళూరులో అతగాడు ఈమెకు తారసపడ్డాడట. అతన్ని చూడగానే లవ్ ఎట్ ఫస్ట్‌సైట్ కలిగిందట. ఆ తరువాత అతగాడితో పరిచయం.. ప్రేమా జరిగిపోయాయి. ఈ ప్రేమ విషయం సంజన ఇంట్లో కూడా తెలుసట. సో.. త్వరలోనే పెళ్లికి సిద్ధమైనట్టుంది ఈ భామ.