పోలీస్ ఆఫీసర్ పాత్రలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ‘గురు’ చిత్రం తరువాత కొంత విరామం తీసుకొని ఇటీవల వరుసగా సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు. దాంట్లో భాగంగా ప్రస్తుతం మెగా హీరో వరుణ్‌తేజ్‌తో కలిసి ఎఫ్ 2 అనే మల్టీస్టారర్‌లో నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఇక ఈ చిత్రం తరువాత బాబి దర్శకత్వంలో నాగ చైతన్యతో కలిసి మరో మల్టీస్టారర్ చిత్రంలో నటించనున్నాడు. వీటితోపాటు ఆయన సోలో హీరోగా నేను లోకల్ చిత్ర దర్శకుడు త్రినాథరావు నక్కిన తెరకెక్కించనున్న చిత్రంలో నటించనున్నాడు. ఇక ఈ చిత్రంలో వెంకీ మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నాడని సమాచారం. ఇంతకుముందు ఘర్షణ, బాబు బంగారం వంటి చిత్రాల్లో ఆయన పోలీసు ఆఫీసర్‌గా నటించారు. పక్కా కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.