వంద రోజుల రంగస్థలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రంగస్థలం. మైత్రి మూవీస్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై సంచలన విజయం సాధించి వంద రోజులు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా వంద రోజుల వేడుకను హైదరాబాద్‌లో జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో హీరో రామ్‌చరణ్ మాట్లాడుతూ ‘మా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, నిర్మాతలు, సుకుమార్, రత్నవేలు, దేవిశ్రీప్రసాద్‌గారికి థాంక్స్. ఎక్కడనుండి మొదలుపెట్టాలో అర్థం కాలేదు. సినిమా 100రోజులు ఆడిందంటే.. ఆ సినిమా వెనుక ఎంత కష్టం ఉందో మనకు తెలిసిందే. అయితే ఒక క్లారిటీ మాత్రం ఉంది. ఒక మనిషి ఆలోచనే ఈ సినిమా. ఆ మనిషే సుకుమార్. ఆయన రైటింగ్‌నుండి ఈ సినిమా మొదలైంది. ఆయన ఆలోచన, మొండి బలం ఈ సినిమా స్టార్ట్ కావడానికి కారణం. ఆయన కలే ఈ సినిమా. ఆయన ఆలోచన వల్లే నేను, రత్నవేలు, దేవిశ్రీప్రసాద్ సహా ఎందరో పనిచేశాం. ఆయన ఆలోచనాస్థాయి వంద రోజుల వరకు తీసుకొచ్చింది. ఆ వ్యక్తికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. అది పవర్‌ఫుల్ ఆలోచన. నా మోస్ట్ లవబుల్ నిర్మాతలు మైత్రీ నిర్మాతలు. రత్నవేలుగారితో ఖైదీ నంబర్ 150తో పనిచేశాను. మళ్లీ ఈ సినిమాకు చేశాను. ఇప్పుడు మళ్లీ సైరా నరసింహారెడ్డికి కూడా పనిచేస్తున్నాను. రాక్‌స్టార్ దేవి పాటలకు నా డాన్స్ మాస్టర్స్ ఎంతో కష్టపడి నాతో డాన్స్ చేయించారు. అలాగే రంగమత్త క్యారెక్టర్‌ను అనసూయగారు బ్యూటీఫుల్‌గా చేశారు. సమంత గారికి, ప్రకాశ్‌రాజ్ గారికి, ఆది పినిశెట్టిగారు, జగపతిబాబుగారు సహా అందరికీ థాంక్స్. మనం నేర్చుకునే ప్రతి చిన్న విషయం మన తల్లిదండ్రుల నుండి.. గురువులనుండి నేర్చుకుంటూ ఉంటాం. నాన్నగారు ఖైదీ నంబర్ 150 సినిమాతో రీఎంట్రీ ఇచ్చినప్పుడు నేను అబ్వర్వ్ చేస్తుండేవాడిని. ఒక వ్యక్తికి ఇంత ఆదరణ, ప్రేమ ఎందుకు వస్తాయని ఆలోచించేవాడిని. గొప్ప క్యారెక్టర్స్‌వల్లనో, మంచి సినిమాలవల్లనో ఆదరణ రాదు. ‘ఎదిగేటప్పుడు మనతోపాటు పదిమందిని పైకి తీసుకెళ్లాలి. ఎందుకంటే ఒకవేళ మనం పడిపోతే.. ఆ పదిమందే మనల్ని కాపాడుతారు’’అని నాన్నగారు చెప్పేవారు. మమ్మల్ని, మా ఇండస్ట్రీని కాపాడేవాళ్లు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్.. వాళ్లు సంతోషంగా ఉంటే.. మేం సంతోషంగా ఉన్నాం. ఈ సినిమాద్వారా వాళ్ళకు లాభాలు వచ్చాయి. సంతోషంగా ఉన్నారు. నా సినిమా అనే కాదు.. ప్రతి సినిమాకు వాళ్లు సంతోషంగా ఉండాలి. ఇండస్ట్రీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను’ అన్నారు. డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ ‘కథ విన్న వెంటనే చరణ్ ఓకే చెప్పి ఉండకపోతే.. వేరే కథతో సినిమా చేసేవాడిని. అయితే రంగస్థలం సినిమా రావడానికి ముఖ్య కారణం చరణే. ఈ ప్రాజెక్ట్ ఇంత బాగారావడానికి మూలకారకుడు చరణ్. నిర్మాతలు నవీన్, రవి, మోహన్‌గారు.. చాలా అందమైన నిర్మాతలు. ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. ఈ సక్సెస్ గురించి వాళ్లు నాతో చెబుతూనే ఉన్నారు. ఇంత మంచి ప్రాజెక్ట్‌చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్. నా సోదరుడు రత్నవేలు లేకుండా విజువల్స్ ఇంత బాగా వచ్చేవి కావు. అలాగే దేవిశ్రీప్రసాద్ నా ఆత్మ. అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. ప్రేక్షకులకు, డిస్ట్రిబ్యూటర్స్‌కి, ఎగ్జిబిటర్స్‌కి... సినిమా మేకింగ్‌లో సపోర్ట్‌చేసిన అందరికీ పేరుపేరునా థాంక్స్’ అన్నారు. నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ ‘ఈరోజుల్లో వంద రోజులు సినిమాలు ఆడుతున్నాయా? అలాంటి ఈరోజుల్లో వంద రోజుల సినిమాను ఇచ్చిన రామ్‌చరణ్‌గారు, సుకుమార్ సహా అందరికీ స్పెషల్ థాంక్స్. మా జీవితంలో మెమరబుల్ మూమెంట్. ఇదొక అద్భుతం. ప్రేక్షకులకు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్‌కు థాంక్స్’ అన్నారు.