అన్నిరకాల పాత్రలు చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి పాత్రలు వస్తే నేను నటించడానికి ఎప్పుడూ సిద్ధమే అని అంటున్నాడు మాజీ క్రేజీ హీరో రాంకీ. అప్పట్లో రాంకీ - నిరోషా జంటగా నటించిన సింధూరపువ్వు సినిమా ఓ పెద్ద సంచలనం క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమాలోని ఓ పాట ఇప్పటికీ వినిపిస్తూనే వుంది. ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా పరిశ్రమలోకి వచ్చి హీరోగా క్రేజ్ తెచ్చుకున్నాడు రాంకీ. ప్రస్తుతం ఆయన క్రేజ్ తగ్గడంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయాడు. తమిళ, తెలుగు భాషల్లో వరుసగా సినిమాలు చేస్తున్న ఆయన తాజాగా ఆర్‌ఎక్స్ సినిమాలో నటిస్తున్నాడు. కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ జంటగా అజయ్ భూపతి తెరకెక్కించిన చిత్రం ‘ఆర్ ఎక్స్ 100’. ఈ చిత్రం ఈనెల 12న విడుదలవుతున్న ఈ చిత్రంలో కీ రోల్‌లో నటించిన రాంకీ చెప్పిన విశేషాలు..
ఆర్‌ఎక్స్ కోసం..
ముఖ్యంగా కథే కారణం. ఈ సినిమాలో నేను చేస్తే బాగుంటుందని మొదట డైరెక్టర్, ప్రొడ్యూసర్ చెన్నై వచ్చి నన్ను కలిశారు. కథ విన్నాను. నాకు బాగా నచ్చింది. వెంటనే వారికి ఈ సినిమా చేస్తున్నానని చెప్పాను. ఇందులో నాది చాలా మంచి పాత్ర. అందరూ అనుకున్నట్లు ఈ సినిమాలో నేను హీరోకి తండ్రిగా నటించలేదు. అసలు ఈ సినిమాలో నాకు పెళ్ళే కాదు. హీరో కోసం అతని లైఫ్‌కోసం నా పాత్ర అంకితం అయిపోతుంది. నిజంగా ఇది గొప్ప పాత్ర.
దర్శకుడితో..
దర్శకుడు అజయ్ భూపతి వెరీ ఇంప్రెస్డ్. నేను సినిమా పరిశ్రమలో ముప్ఫై సంవత్సరాల నుండి దాదాపు వందకుపైగా చిత్రాల్లో నటించాను. ఎన్నో చూశాను. ఒక్కటి చెప్తారు, ఇంకోలా తీస్తారు. కానీ ఈ డైరెక్టర్ ఏం చెప్పారో దానికన్నా బాగా తీశారు. అనుకున్నదానికన్నా బాగా వచ్చింది. ఎందుకంటే ఈ సినిమాలో బెస్ట్ టెక్నీషియన్స్ పనిచేశారు. ఎడిటర్ ప్రవీణ్, కెమెరా రామారెడ్డి చాలా బాగా చేశారు. ఒక్క సీన్ కోసం ఐదు కెమెరాలు వాడిన సందర్భాలు ఉన్నాయి. డైరెక్టర్ బాగా ప్లాన్ చేశారు. ఆర్టిస్టుల దగ్గరనుండి బాగా నటన రాబట్టుకున్నారు. నిజానికి ఈ సినిమా కోసం నేను కూడా ఓ కొత్త నటుడిలా మారిపోయాను. ప్రొడ్యూసర్స్ కూడా రెగ్యులర్ ప్రొడ్యూసర్స్‌కంటే ఆర్టిస్టులను బాగా చూసుకున్నారు. ప్రొడక్షన్ బాగా ప్లాన్ చేశారు.
అలా వచ్చాను..
మా ఇంట్లో అంతకుముందు ఎవరూ సినిమాల్లో లేరండి. నేనే మొదటి వ్యక్తిని. ఫిల్మ్ స్కూల్‌లో చదివి వచ్చాను. వచ్చిన వెంటనే నేను చేసిన ఎనిమిది సినిమాలు వరుసగా హిట్ అయ్యాయి. వంద రోజులు కూడా ఆడాయి. కానీ నాకు అప్పుడు కెరీర్‌ను ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలియలేదు. దాంతో హీరోగా ఎక్కువ సినిమాలు చేయలేకపోయాను.
తెలుగులో కూడా..
ఆమధ్య ఆకతాయి చిత్రంలో నటించాను. ఆ చిత్రం తర్వాత ఆర్‌ఎక్స్ 100లోనే చేస్తున్నాను. మంచి పాత్రలు వస్తే నేను నటించడానికి ఎప్పుడూ సిద్ధమే. ఈమధ్య తమిళంలో కూడా గ్యాప్ వచ్చిం ది. దానికి కారణం.. నాకు డైరెక్షన్‌మీద బాగా ఆసక్తి. దాంతో డైరెక్షన్ స్టార్ట్ చేశాను. నేను చేసిన కొన్ని సీరియల్స్ బాగా హిట్ అయ్యాయి కూడా.
రాజకీయాలు..
ప్రస్తుతం రజనీ, కమల్ ఇద్దరూ పార్టీలు పెట్టి రాజకీయాల్లో బిజీగా మారారు.. కానీ నాకు పాలిటిక్స్‌మీద పెద్దగా ఆసక్తి లేదు.
తదుపరి సినిమాలు..
ప్రస్తుతం తమిళంలో మూడు సినిమాలు చేస్తున్నాను.. తెలుగులో కూడా చేయాలని వుంది. మంచి పాత్రలకు వెయిటింగ్.. కంటెంట్, సినిమాలో నేను చేసే పాత్రకు ఇంపార్టెంట్ ఉంటే విలన్ పాత్ర అయినా ఓకె.

- శ్రీ