సాయిశ్రీనివాస్ - కాజల్ జంటగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్, దర్శకుడు తేజ కాంబినేషన్‌లో సినిమా సోమవారం పూజా కార్యక్రమాలతో నానక్‌రామ్‌గూడ రామానాయుడు స్టూడియోలో ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమంలో దర్శకులు వి.వి.వినాయక్, శ్రీవాస్ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. తొలి షాట్‌కు వి.వి.వినాయక్ క్లాప్ కొట్టగా, శ్రీవాస్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు తేజ ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. మాజీ మంత్రి దానం నాగేంద్ర చిత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈరోజు ప్రారంభం అయ్యింది. బెల్లంకొండ సాయిశ్రీనివాస్, కాజల్ అగర్వాల్, అభిమన్యుసింగ్ షూటింగ్‌లో పాల్గొన్నారు. ఏకే.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డైరెక్టర్ తేజ, కాజల్ కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా ఇది. అలాగే హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్, కాజల్ రెండోసారి కలిసి నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి లక్ష్మిభూపాల్ మాటలు రాస్తుండగా శీర్ష రే సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రంలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్, కాజల్ అగర్వాల్, సోనుసూద్, అభిమన్యుసింగ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్: తేజ, ప్రజెంట్స్: ఏటివి, నిర్మాత: రామబ్రహ్మం సుంకర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కృష్ణకిషోర్ గరికపాటి, రచయిత: లక్ష్మీభూపాల్, కెమెరామెన్: శీర్ష రే, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు.