సెంటిమెంట్ భయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోవా భామ ఇలియానా దక్షిణాది సినిమాలు వదిలేసిన తరువాత బాలీవుడ్‌లో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించినా పెద్దగా కలిసిరాలేదు. చేసిన రెండు మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలవడంతో ఈమెకు వచ్చే అవకాశాలు కూడా రావడం మానేశాయి. దాంతో అవకాశాల కోసం వెతుక్కునే పనిలో పడింది. దాంతోపాటు ఖాళీగా వుండలేక సోషల్ మీడియాలో నానా హంగామా చేస్తూ బాగానే పాపులారిటీ తెచ్చుకుంటోంది. తాజాగా ఈ భామకు అక్షయ్ కుమార్ సరసన ‘రుస్తుమ్’ చిత్రంలో హీరోయిన్‌గా అవకాశం దక్కింది. ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ సినిమాపై ఈమెకు పెద్దగా ఆసక్తిలేదని అంటోంది. దానికి కారణం, సౌత్ హీరోయిన్లు అక్షయ్ కుమార్ సరసన నటిస్తే, అది ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుందనే సెంటిమెంట్ వుందట. ఇప్పటికే ఈ విషయంలో ఆసిన్, కాజల్, తాప్సిలు అపజయాలు ఎదుర్కొన్నారు. ఇపుడు ఇలియానా వంతు రావడంతో ఈ సెంటిమెంట్‌పై తెగ భయపడుతోందట. మొత్తానికి ‘రుస్తుమ్’ ఇలియానాను గట్టెక్కిస్తాడో లేదా కనుమరుగు చేస్తాడోనని అనుకుంటున్నారు
బాలీవుడ్ జనాలు.