ప్రేమెంత పనిచేసే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జె.ఎస్.ఆర్. మూవీస్ పతాకంపై శ్రీమతి భాగ్యలక్ష్మి సమర్పణలో హరికృష్ణ జొన్నలగడ్డ, అక్షిత హీరో హీరోయిన్లుగా జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో సావిత్రి జొన్నలగడ్డ నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమెంత పనిచేసే నారాయణ’. ఈ చిత్ర ఆడియో ఇటీవల వైయస్ జగన్మోహన్‌రెడ్డి చేతుల మీదుగా విడుదలైంది. ఇక ఈ చిత్రంలోని సాంగ్ విజువల్స్‌ను సినీ, రాజకీయ ప్రముఖులు ఆవిష్కరించారు. ‘అట్టా సూడమాకు...’ సాంగ్ విజువల్‌ను జయప్రద, ప్రముఖ పొలిటీషియన్ అమర్‌సింగ్ ఆవిష్కరించగా, ‘ఈ బుజ్జిగాడికి నచ్చేశావే..’ పాటను దర్శకుడు క్రిష్, ‘హరిలో రంగ హరి...’ విజువల్ సాంగ్‌ను మాస్ మహారాజ రవితేజ ఆవిష్కరించి... హరికృష్ణలో మంచి డాన్సర్‌తోపాటు, అద్భుతమైన యాక్టర్ ఉన్నాడంటూ ప్రశంసించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఈరోజు ఫిలిం ఛాంబర్‌లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘‘ఇటీవల వైయస్ జగన్‌గారి చేతుల మీదుగా విడుదలైన ఆడియో సాంగ్స్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. అలాగే వీడియో సాంగ్స్ ప్రముఖుల చేతుల మీదుగా ఆవిష్కరించాం. అలాగే ‘ఈ బుజ్జిగాడికి నచ్చావే... పాటను ఆవిష్కరించిన ప్రముఖ దర్శకుడు క్రిష్‌గారైతే పాటలన్నీ రీప్లే చేసుకుని మరీ చూశారు. మూడో పాట ‘హరిలో రంగ హరి...’ పాటను ఆవిష్కరించిన రవితేజగారు.. మాస్ మూమెంట్స్ హరి ఇరగదీసాడు అంటూ మెచ్చుకున్నారు. ఇలా సినీ పరిశ్రమకు చెందిన చాలామంది మా హరికి సపోర్ట్ చేయడం చాలా ఉత్సాహాన్ని ఇస్తోంది. జగపతిబాబుగారు వాయిస్ ఓవర్ ఇచ్చారు. అది సినిమాకు చాలా ప్లస్ అవుతుంది. ఆదిత్య మ్యూజిక్‌వారు పాటలను బాగా ప్రమోట్ చేస్తున్నారు. యాజమాన్య గారు అద్భుతమైన పాటలిచ్చారు. ఇందులో లవ్‌తోపాటు మంచి ఫ్యామిలీ డ్రామా కూడా ఉంటుంది. ఝాన్సీగారు విభిన్నమైన పాత్ర చేశారు. హీరో హరికృష్ణ జొన్నలగడ్డ మాట్లాడుతూ... ‘జగన్‌గారి చేతుల మీదుగా విడుదలైన పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. సాంగ్ విజువల్స్ కూడా సినీ ప్రముఖులు రిలీజ్ చేసి బ్లస్ చేయడం చాలా హ్యాపీ. ముఖ్యంగా ముంబై వెళ్లి జయప్రదగారి చేతుల మీదుగా ‘అట్ట చూడమాకే’ సాంగ్ విడుదల చేయించాం. జయప్రద మేడమ్ ఇచ్చిన కాంప్లిమెంట్స్ ఎప్పటికీ మరువలేను అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా’ అన్నారు.