చక్కటి సందేశంతో చిన్నారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బలిజ క్రియేషన్స్ పతాకంపై వేణుకుమార్ నిర్మాతగా విక్కీ దర్శకత్వం వహించి నటించిన చిత్రం ‘చిన్నారి’. ఈ చిత్రంలో సంజనా పటేల్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా ముఖ్యపాత్ర పోషించింది. శర్మ హీరోయిన్. ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. ఈ వేడుకలో సీనియర్ నటీనటులు గీతాంజలి, రోజారమణి, కవిత, నటుడు తోటపల్లి మధు, తెలంగాణ మూవీ అండ్ టీవీ ఆర్టిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్ శివన్న, డైమండ్ రత్నం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గీతాంజలి మాట్లాడుతూ.. ఈ సినిమాకు నేను రెండు రోజులు వర్క్ చేసాను. మంచి మెసేజ్ ఇచ్చే సినిమా ఇది అని అన్నారు. నటి కవిత మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో వయసుతో నిమిత్తం లేకుండా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. చాలా బాధాకరం. ఇలాంటి సంఘటనను తీసుకొని సినిమా చేశాడు విక్కీ. ప్రజలు చైతన్యవంతులుగా చేయడానికి చిన్నారి అనే సినిమాను రూపొందించాడు దర్శకుడు. వీరందరినీ ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు. ఈ చిత్ర దర్శకుడు, హీరో విక్కీ మాట్లాడుతూ.. డైమండ్ రత్నంగారిని చూసి ఇన్‌స్పైర్ అయ్యి సినిమా చేశాను. ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే ‘రిప్’అని పెట్టి, ఒక్కరోజులోనే మరిచిపోతాం. అలా ఒకరోజు బాధపడితే మనం వారికి చేసే మేలు ఏమిటి...? అందుకే అన్యాయం జరిగిన అమ్మాయికి వారి కుటుంబానికి న్యాయం జరిగేలా నిందితుడికి శిక్షపడేలాచేయమంటూ తెలిపే చిత్రమే ఈ చిన్నారి సినిమా కథ అని అన్నారు. ఈ కార్యక్రమంలో రోజారమణి, శివన్న, హీరోయిన్ స్నేహశర్మ తదితరులు పాల్గొన్నారు.