సంగీత్ హంగామాలో నర్తనశాల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగశౌర్య, కాశ్మీరా జంటగా శ్రీనివాసరావుని దర్శకుడిగా పరిచయం చేస్తూ తాజాగా చలో వంటి హిట్ చిత్రాన్ని నిర్మించిన ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ముల్పూరి, శంకర ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం నర్తనశాల. ఈ సినిమాకు సంబంధించిన ఓ సంగీత్ నేపథ్య గీతాన్ని హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో వేసిన సెట్‌లో చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా నాగశౌర్య మాట్లాడుతూ- కథానుగుణంగా చిత్రానికి నర్తనశాల అనే పేరు పెట్టాం. పాత నర్తనశాల చిత్రం పేరును చెడగొట్టకుండా జాగ్రత్తగా సినిమా తీస్తున్నాం అన్నారు. దర్శకుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ- ఈ చిత్రానికి సాగర్ మంచి పాటలిచ్చారు. వినోదం, సెంటిమెంట్ కలబోతగా సాగే చిత్రమిది. ఐదు పాటలుంటాయి. ఇప్పటికే చాలావరకు చిత్రీకరణ పూర్తికావచ్చింది అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ టాకీపార్ట్‌తో పాటు మూడు పాటలు పూర్తయ్యాయి. ఈనెల 10 నుంచి 20 వరకు విదేశాల్లో రెండు పాటల్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఆగస్టు నెలాఖరులో చిత్రాన్ని విడుదల చేస్తాం అని చెప్పారు. చక్కటి కథాబలమున్న చిత్రంలో నటిస్తున్నందుకు ఆనందంగా ఉందని కథానాయికలు కాశ్మీరా, యామినీ తెలిపారు. ఈ కార్యక్రమంలో అజయ్, సుధా, విజయ్‌కుమార్, కిరణ్‌కుమార్, ప్రియా తదితరులు పాల్గొన్నారు.