33 ఏళ్ల తరువాత..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయిబాబాగా ‘షిరిడీ సాయి మహత్యం’ చిత్రంలో నటించి, తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు చూరగొన్న నటుడు విజయ్‌చందర్, దాదాపు 33 సంవత్సరాల తర్వాత మళ్లీ బాబా పాత్రలో నటిస్తున్నారు. శ్రీ మల్లాది వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై జి.ఎల్.బి.శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సాయే దైవం’ చిత్రం హైదరాబాద్‌లోని సాయిబాబా గుడిలో ప్రారంభమైంది. సాయిబాబా భక్తుల అనుభవాల నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రం గురించి దర్శక, నిర్మాత శ్రీనివాస్ వివరాలు తెలియజేస్తూ, ‘షిరిడీ సాయి మహత్యం’ సినిమా తర్వాత సాయిబాబా పాత్రలు చేయమని అవకాశాలు వచ్చినా చేయకుండా ఇన్నాళ్లకి మళ్లీ విజయ్‌చందర్ సాయి పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సాయే దైవం’ చేస్తున్నామని, ప్రస్తుతం పతాక సన్నివేశాలు చిత్రీకరణ జరుపుతున్నామని అన్నారు. దీంతో సినిమా మొత్తం పూర్తవుతుందని, వచ్చేనెల పాటల్ని విడుదల చేసి, మేలో చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు. విజయ్‌చందర్ మాట్లాడుతూ, చాలా విరామం తర్వాత బాబాగా నటించే అవకాశం రావడం, కథ బాగా నచ్చడంతో ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నానని అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సురేందర్‌రెడ్డి, సంగీతం: ఘటికాచలం, నిర్మాత, దర్శకత్వం: జి.ఎల్.బి.శ్రీనివాస్.