ఆధునిక సొబగులతో సారథి స్టూడియో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1956లో ప్రారంభమైన సారథి స్టోడియో అనేక వందల చిత్రాలకు నెలవుగా ఇన్నాళ్లు సేవలు అందించింది. ఇప్పుడు మళ్లీ 60 సంవత్సరాల తర్వాత నేటి చిత్రీకరణ పద్ధతులకు అనుగుణంగా తీర్చిదిద్ది పరిశ్రమకు అంకితం చేశారు. ఈ పునరంకిత కార్యక్రమంలో దాసరి నారాయణరావు మాట్లాడుతూ, తెలుగు సినిమా పదానికి ఉపమానంగా సారథి స్టూడియో నిలిచిందని, ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఈ స్టూడియోను మళ్లీ పునరంకితం చేయడం అభినందనీయమని తెలిపారు. ఈ సంస్థ ఇదే విధంగా కొనసాగుతూ మరిన్ని విజయాల్ని సాధించాలని ఆయన కోరుకున్నారు. కార్యక్రమంలో కె.విశ్వనాథ్, రేలంగి నరసింహారావు, సానా యాదిరెడ్డి, వీరశంకర్, అల్లాణి శ్రీ్ధర్ తదితరులు పాల్గొని విశేషాలు తెలిపారు.