28న హ్యాపీ వెడ్డింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. అంటే జీవించినంతకాలం ఒకరినొకరు అర్థం చేసుకుని ఎటువంటి మనస్ఫర్థలు లేకుండా జీవించాలని అర్థం. యువి క్రియేషన్స్, పాకెట్ సినిమావారు కలిసి సుమంత్ అశ్విన్, నిహారికల హ్యాపీ వెడ్డింగ్‌కి ఈనెల 28గా నిర్ణయించారు. అంతే ఇటు ప్రొడక్షన్ హౌస్‌లో ప్రమోషన్ కూడా మొదలైంది. త్వరలోనే సాంగ్స్ విడుదల, ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ని అత్యంత గ్రాండ్‌గా చేయాలని నిర్ణయించారు. సుమంత్, నిహారిక నటించిన చిత్రం హ్యాపీ వెడ్డింగ్. దర్శకుడు లక్ష్మణ్. సంగీతం శక్తికాంత్ అందించగా, రీ రికార్డింగ్ ఎస్.ఎస్.తమన్ అందిస్తున్నారు. ఫొటోగ్రఫీ బాల్‌రెడ్డి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనున్నాడు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితతంలో జరిగే విషయమే. అయితే పెళ్లి కుదిరిన రోజునుండి పెళ్లి జరిగే రోజు వరకు రెండు కుటుంబాల మధ్య రెండు మనసుల మధ్య ఏం జరుగుతుందనే విషయాన్ని చాలా అందంగా చూపించాం. అన్ని వయసులవారు ఈ చిత్రానికి కనెక్ట్ అవుతారు. ఈ చిత్రాన్ని ఈనెల 28న విడుదల చేస్తున్నాము అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: యువి క్రియేషన్స్, నిర్మాత: పాకెట్ సినిమా, కెమెరా: బాల్‌రెడ్డి, మ్యూజిక్: శక్తికాంత్, దర్శకత్వం: లక్ష్మణ్ కార్య.