వీరభోగ వసంతరాయలు ఫస్ట్‌లుక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నారా రోహిత్, శ్రీవిష్ణు, సుధీర్‌బాబు, శ్రీయ కాంబినేషన్‌లో రూపొందుతున్న మల్టీస్టారర్ చిత్రం ‘వీరభోగ వసంతరాయలు’. ఈ చిత్రాన్ని బాబా క్రియేషన్స్ పతాకంపై ఎంవికె రెడ్డి సమర్పణలో అప్పరావు బెల్లాన నిర్మిస్తున్నారు. ఆర్.ఇంద్రసేన దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం టైటిల్ లోగో ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత అప్పారావు బెల్లాన మాట్లాడుతూ- ఈ సినిమా ఇప్పటివరకు ఎవ్వరూ చూడని విధంగా ఎవరూ ఊహించని విధంగా డిఫరెంట్‌గా వుంటుంది. మా హీరోలు నారా రోహిత్, శ్రీవిష్ణు, సుధీర్‌బాబు సినిమాకు చాలా సపోర్టు చేశారు. 24 క్రాఫ్ట్స్‌కి చాలా థాంక్స్ అన్నారు. దర్శకుడు ఇంద్రసేన్. ఆర్ మాట్లాడుతూ నారా రోహిత్, శ్రీ విష్ణు నాకు బ్యాక్‌బోన్‌గా నిలిచారు. సుధీర్‌బాబు, శ్రీయకి చాలా థాంక్స్. చిన్నప్పుడు మా ఇంటివెనకాల వున్న గుడిలో బ్రహ్మంగారి చరిత్ర రోజూ వినేవాడిని. అందులో వీర భోగ వసంతరాయలు గురించి విన్నాను. అది ఎందుకో నా మనసులో స్థిరంగా నాటుకుపోయింది. నేను ముందు కథ రాసుకున్నాను. ఆ తరువాత వీర భోగ వసంతరాయలు టైటిల్‌కి ఇది బాగా కుదిరింది. సినిమాకు ఇదే బ్యాక్‌బోన్ పాయింట్. అందరికీ ఫస్ట్‌లుక్ బాగా నచ్చిందని అనుకుంటున్నాను అన్నారు. హీరో నారా రోహిత్ మాట్లాడుతూ- ముందుగా ఈ పోస్టర్‌ని అద్భుతంగా తీర్చిదిద్దిన భానుకి స్పెషల్ థాంక్స్. ఈ సినిమాలో హీరోలు అంటూ ఉండరు. ప్రతి క్యారెక్టర్ హీరోనే. ఇది ఎక్స్‌పరిమెంటల్ సినిమా. మన తెలుగులో ఇలాంటి సినిమా రాలేదు. సినిమా టీజర్ త్వరలోనే విడుదల అవుతాయి అన్నారు.