యూ టర్న్ ముగిసింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమంత ముఖ్యపాత్రలో నటించిన యూ టర్న్ సినిమా టాకీపార్టు పూర్తిచేసుకొని నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రంలో సమంత న్యూస్ రిపోర్టర్ పాత్రలో కనిపించబోతోంది. థ్రిల్లర్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. పవన్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పాటల చిత్రీకరణ జరుపుకోనుంది. ఆది పినిశెట్టి పోలీసు ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్న ఈ చిత్రంలో భూమిక చావ్లా, హీరో రాహుల్ రవీంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించారు. త్వరలో ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. శ్రీనివాస్ సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో సమంత, ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక చావ్లా తదితరులు నటిస్తుండగా, కథ, దర్శకత్వం: పవన్‌కుమార్, నిర్మాత: శ్రీనివాస చిట్టూరి.