హైదరాబాద్‌లో సాహూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాహుబలి తరువాత ప్రభాస్ హీరోగా నటిస్తున్న సాహూ సినిమా షూటింగ్ ఈ రోజునుండి హైదరాబాద్‌లో మొదలైంది. మొన్నటివరకు దుబాయ్‌లోని ప్రముఖ లొకేషన్స్‌లో దాదాపు రెండు నెలలపాటు షూటింగ్ జరిపారు. అక్కడే 90 కోట్ల భారీ బడ్జెట్‌తో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. తాజాగా మూడో షెడ్యూల్ ఈ రోజు నుండి హైదరాబాద్‌లో మొదలైంది. ప్రస్తుతం ఫిలిం సిటీలో ప్రారంభం అయిన ఈ షెడ్యూల్‌లో హీరో హీరోయిన్స్, నటులు పాల్గొనగా కీలక సన్నివేశాలు తీశారట. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సాహూ ఒక్క తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ భాషల్లో కూడా విడుదల కానుంది. ఈ సినిమా తరువాత ప్రభాస్ జిల్ రాధాకృష్ణతో మరో సినిమాకు కమిట్ అయ్యాడు. ఈ చిత్రం ఆగస్టు మొదటివారంలో ప్రారంభం కానుంది. దాంతోపాటు ప్రభాస్ ఓ హిందీ సినిమా కూడా ఈ ఏడాది చివరలో చేస్తాడట. ఇక సాహూ సినిమాలో బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నది.