త్రివిక్రమ్ కోసం బన్నీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నో ఆశలు పెట్టుకున్న నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోవడంతో అల్లు అర్జున్ తీవ్ర నిరాశలో ఉన్నాడు. ఆయన తదుపరి సినిమా విషయంలో కాస్త ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. తాజాగా మనం ఫేం విక్రమ్‌కుమార్‌తో సినిమాకు ఓకె చెప్పిన అల్లు అర్జున్ వచ్చే నెలనుండి ఆ సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నాడు. అయితే అల్లు అర్జున్ మాత్రం నెక్స్ట్ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన జులాయి సంచలన విజయం సాధించగా.. సన్నాఫ్ సత్యమూర్తి యావరేజ్‌గా నిలిచింది. అయితే త్రివిక్రమ్ సినిమాతో తన స్థాయిని పెంచుకున్న అల్లు అర్జున్ తరువాతి సినిమా కోసం ఆయనతో చర్చలు జరుపుతున్నాడట. ప్రస్తుతం త్రివిక్రమ్, ఎన్టీఆర్‌తో చేస్తున్న అరవింద సమేత త్వరలో పూర్తి కానుంది. ఈ సినిమా తరువాత అల్లు అర్జున్‌తో సినిమాకు త్రివిక్రమ్ పాజిటివ్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. అన్నిరకాల అంశాలతో ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమాను తీయడంలో త్రివిక్రమ్ శైలి వేరు.. అందుకే ఆయనతో చేస్తే మళ్లీ తన ఇమేజ్ పెంచుకోవచ్చు. కాబట్టి అల్లు అర్జున్ ప్లాన్ గట్టిగానే వర్కవుట్ అయ్యేలా వుంది.