‘విజేత’కు మెగా ప్రశంస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కళ్యాణ్‌దేవ్, మాళవికానాయర్ నటించిన చిత్రం ‘విజేత’. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై సాయి కొర్రపాటి నిర్మాణ సారథ్యంలో రజనీ కొర్రపాటి నిర్మాతగా రాకేశ్ శశి దర్శకత్వంలో సినిమా రూపొందింది. ఈనెల 12న ఈ చిత్రం విడుదలైంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో.. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ‘నేను నటించిన ‘విజేత’ సినిమా టైటిల్‌తో కళ్యాణ్ నటించిన విజేత ఎలా ఉంటుందో ఎలాంటి రిజల్ట్ రాబట్టుకుంటుందోనని క్యూరియాసిటీ ఎక్కువగా ఉన్నది. నేను సినిమా చూశాను. చాలా ఇంప్రెస్ అయ్యాను. నా విజేత సినిమా ఫ్యామిలీ సినిమా. నన్ను ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గర చేసిన చిత్రం. ఈ సినిమా కూడా ఫ్యామిలీ సినిమాయే. కుటుంబ విలువలు. తల్లిదండ్రులు, పిల్లలు, వారి మధ్యనున్న అనుబంధాలు ఎలా ఉండాలి. ఎలాంటి బాధ్యతలు ఉండాలని విడమరిచి చెప్పిన సినిమా ఇది. ఎడ్యుకేటివ్ ఫిలిం కూడా. ఎందుకంటే యూత్ నేడు వివిధ ఆకర్షణలకు లోనై ఫ్యామిలీలను నిర్లక్ష్యం చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లల భవిష్యత్‌పై ఆందోళన పడటం చూస్తుంటాం. అలాంటి వారందరూ సినిమాను చూడాలని నేను కోరుకుంటున్నాను. డైరెక్టర్ శశి సినిమాను అద్భుతంగా మలిచాడు. నటీనటుల విషయానికి వస్తే.. నా తొలి మార్కులు మురళీ శర్మకే దక్కుతాయి. మధ్యతరగతి తండ్రి పాత్రలో చిన్నచిన్న ఎక్స్‌ప్రెషన్స్‌ను కూడా అద్భుతంగా పలికిస్తూ నటించాడు మురళీకృష్ణ. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఆయన నటన అద్భుతం. కళ్యాణ్‌దేవ్.. ఎక్కడా బెరుకు లేకుండా.. తర్ఫీదు పొందిన నటుడిలా పరిణితితో తనదైన స్టయిల్‌లో సెటిల్డ్‌గా నటించాడు. ఎమోషనల్ సీన్స్‌లో, బ్రేక్ డౌన్ సీన్స్‌లో చక్కగా నటించాడు. భవిష్యత్ ఉన్న నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. నిర్మాత సాయి కొర్రపాటిగారు.. కథ అనుకున్న దగ్గర ఉండి ఇన్‌వాల్వ్‌మెంట్‌తో ఎంతో తపనతో సినిమాను నిర్మించారు.. అన్నారు.
దర్శకుడు రాకేశ్ శశి మాట్లాడుతూ.. ‘చిరంజీవిగారు ఈ కథను ఒప్పుకున్నందుకు ఆయనకి థాంక్స్. ఓ మంచి కథను జెన్యూన్‌గా చెప్పాలనే ఆలోచనతోనే ఈ సినిమా చేశాం. తండ్రి కొడుకులమధ్య ఉండే ఎమోషన్స్ ఎన్ని తరాలుమారినా మారవు. ప్రతి ఒక్కరూ ఎంజాయ్‌చేసే సినిమా అన్నారు. కళ్యాణ్‌దేవ్ మాట్లాడుతూ.. ‘మా సినిమాను ఇంత బాగా రిసీవ్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కథను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ప్రారంభంలోనే ఇంత మంచి కథతో సినిమా చేయడం ఆనందంగా ఉంది. సెంథిల్‌గారికి, రామకృష్ణగారికి అందరికీ థాంక్స్’ అన్నారు.