ప్రేమకథ కోసం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ భామ కృతిసనన్ తాజాగా ఓ స్వచ్ఛమైన ప్రేమకథలో నటిస్తున్నారు. లవ్ రంజాన్ రూపొందిస్తున్న రొమాంటిక్ కామెడీ ‘లుకచుప్పి’ చిత్రంలో యువ కథానాయకుడు కార్తిక్ ఆర్యన్ సరసన హీరోయిన్‌గా ఎంపికయ్యారు. ఇందులో కార్తిక్ మధురలోని లోకల్ టీవీ ఛానెల్ రిపోర్టర్‌గా నటించనున్నారు. కృతి మధురాకు చెందిన అమ్మాయిగా కనిపిస్తారు. స్టడీకోసం ఢిల్లీ వెళ్లి వచ్చిన పాత్ర ఆమెది. నేటి మహిళల ఆలోచనలు, జెండర్ ఈక్వాలిటీ ప్రతిబింబంగా కృతి పాత్ర ఉంటుంది. మధుర, గ్వాలియర్, ఆగ్రా నేపథ్యంలో సినిమా సాగుతుంది అని నిర్మాత దినేష్ తెలిపారు. ఈ చిత్రం ఆగస్ట్‌లో ప్రారంభంకానుంది. ప్రేమికుల రోజు కానుకగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కృతి ప్రస్తుతం ‘అర్జున్ పాటియాలా’, ‘కళంక్’చిత్రాల్లో నటిస్తున్నారు. గత ఏడాది ‘రాబ్తా’, ‘బరేలీ కి బర్ఫీ’ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.