20న ‘లవర్’ రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌తరుణ్, రిద్ధికుమార్ జంటగా నటించిన చిత్రం ‘లవర్’. అనీష్ కృష్ణ దర్శకత్వం వహించారు. హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు నిర్మాణ సారథ్యంలో శిరీష్ సమర్పణలో హర్షిత్ ఈ సినిమాను నిర్మించారు. ఈనెల 20న సినిమా విడుదలవుతుంది. హైదరాబాద్ ఐమ్యాక్స్‌లో ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదలచేశారు. సినిమాకు సంగీతం అందించిన సంగీత దర్శకులు అంకిత్ తివారి, తనీశ్, సాయికార్తీక్, జె.బి. ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా.. నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ.. ‘15 సంవత్సరాల్లో 27 (గత ఏడాదితో) సినిమాలు చేశాం. అందులో 22 సినిమాలు సక్సెస్‌ఫుల్ అయ్యాయి. 5 వర్కవుట్ అయ్యాయి. ఇది మా బ్యానర్‌లో 28వ సినిమా. ఇందులో చిన్న సినిమాలుగాచూస్తే ఇది మూడో సినిమా. కేరింత తర్వాత మరో చిన్న సినిమా ఇది. హర్షిత్ చేస్తానంటే.. అనీశ్ చెప్పిన కథతో మొదలైన సినిమా ఇది. లుక్, టీజర్, సాంగ్స్ బావున్నాయని అంటున్నారు. ఈరోజు విడుదలచేసిన ట్రైలర్ కూడా బావుందని అంటున్నారు. చిన్న సినిమాగా విడుదలవుతున్న ఈ చిత్రం పెద్ద సక్సెస్ అవుతుందనే నమ్ముతున్నాం. మేం ఎంత కష్టపడ్డా చివరికి అది ప్రేక్షకుడికి నచ్చాలి. అప్పుడే మా అందరికీ ప్రయోజనం. మా లవర్స్ సక్సెస్ సాధించి మా అందరికీ ప్రయోజనం దొరుకుతుందని భావిస్తున్నాను. నిర్మాతగా హర్షిత్ తొలి సినిమా ఇది. నా తొలి సినిమాకు కూడా నెర్వస్ ఫీల్‌కాలేదు. కానీ ఈ సినిమా కాస్త నెర్వస్‌గా ఫీల్ అవుతున్నాను. నేను చేయడానికి, వెనకుండి చేయించడానికి చాలా తేడా ఉంది. చాలా కష్టమైన పనికూడా. ఎందుకంటే మనకి కొన్ని నచ్చుతాయి. వాళ్లకి వేరే నచ్చుతాయి. వాళ్లే కరెక్ట్ అని అంటుంటారు. ఇప్పటివరకు ఇంత టఫ్ జాబ్ డైరెక్టర్స్‌తో ఫేస్‌చేశాను. ఈసారి హర్షిత్‌తో ఫేస్ చేశాను. అందరూ హార్డ్‌వర్క్‌చేసి అద్భుతమైన అవుట్‌పుట్ ఇచ్చారు. ఈనెల 20న లవర్ విడుదలై సక్సెస్‌ఫుల్ సినిమా అవుతుందని నమ్ముతున్నాను’ అన్నారు. సాయికార్తీక్ మాట్లాడుతూ.. ‘‘ఆల్‌రెడీ సినిమాలో పాటలు పెద్ద హిట్‌అయ్యాయి. అందులో సందేహం లేదు. అవకాశం ఇచ్చిన దిల్‌రాజుగారికి థాంక్స్’ అన్నారు.