రాజ్‌తరుణ్ ‘అదోటైపు...’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హ్యాట్రిక్ విజయంతో జోరుమీదున్న రాజ్‌తరుణ్‌కు ఇప్పుడు చేతినిండా అవకాశాలున్నాయి. ఇప్పటికే మంచువిష్ణుతో కలిసి నటిస్తున్న సినిమా దాదాపు పూర్తికావచ్చింది. ఈ చిత్రానికి ‘వీడు అదో టైపు.. వాడు మరోటైపు’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు తెలిసింది. దీంతోపాటు సీనియర్ దర్శకుడు వంశీ దర్శకత్వంలో ఓ సినిమాలో కూడా నటిస్తున్నాడు. దాంతోపాటు దిల్‌రాజు బ్యానర్‌లో కొత్త దర్శకునితో చేయబోయే సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. అంతేకాకుండా ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో మరో చిత్రం కూడా సిద్ధంగా ఉంది. వీటితోపాటు మరికొన్ని చర్చల దశలో ఉన్నాయని తెలిసింది. ఏది ఏమైనా టాలీవుడ్‌లో క్రేజీ హీరోగా దూసుకుపోతూ తనదైన దూకుడును ప్రదర్శిస్తూ వరుస విజయాలు అందుకుంటున్నాడు ఈ యువ హీరో.