‘విజేత’ బాగా నచ్చింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్‌దేవ్ హీరోగా మాళవికా నాయర్ హీరోయిన్‌గా వారాహి చలనచిత్రం పతాకంపై సాయి శివాని సమర్పణలో రాకేష్ శశిని దర్శకుడిగా పరిచయం చేస్తూ రజని కొర్రపాటి నిర్మించిన చిత్రం విజేత. ఈ చిత్రం ఈనెల 12న విడుదలయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విజేత విజయోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి హీరో అల్లుఅర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హీరో కాల్తాన్‌దేవ్, హీరోయిన్ మాళవికా నాయర్, నటులు మురళీశర్మ, రాజీవ్ కనకాల, కెమెరామెన్ కె.కె సెంథిల్‌కుమార్, దర్శకుడు రాకేష్ శశి, నిర్మాత సాయికొర్రపాటి, ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ‘‘ఒకపక్క పెద్ద సినిమాలు చేస్తూనే... మరోపక్క చిన్న సినిమాలు చేస్తున్న సాయి కొర్రపాటి గారికి కంగ్రాట్స్. ప్రతిసారి కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్ చేస్తూ.. మంచి కంటెంట్‌తో మూవీస్ తీస్తున్నారు ఆయన. అందుకే ఆయనంటే నాకు చాలా రెస్పెక్ట్. మంచి కంటెంట్‌తో వస్తే ఎప్పటికైనా వారాహి చలనచిత్రంలో సినిమా చేస్తాను. హర్షవర్ధన్ మ్యూజిక్, కె.కె సెంథిల్ కుమార్ ఫొటోగ్రఫీ, రాకేష్ టేకింగ్, సాయిగారి మేకింగ్ వాల్యూస్, రామకృష్ణ సెట్స్, సినిమాకి బిగ్ ఎస్సెట్ అయ్యాయి. ముఖ్యంగా కళ్యాణ్ అంటే నాకు పర్సనల్‌గా చాలా ఇష్టం. ఫస్ట్ సినిమా ఎలా చేస్తాడా అని చూసాను. సినిమాల్లో కళ్యాణ్‌ని చూడలేదు. ఆ క్యారెక్టర్ని చూసాను. ఎమోషనల్ సీన్స్‌లో కంట తడిపెట్టించాడు. అలాగే మురళీశర్మ బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేశారు. డైరెక్టర్ రాకేష్ సెకండ్ ఫిల్మ్ అయిన కూడా చాలాబాగా తీసాడు. మాళవిక వండ్రఫుల్‌గా చేసింది. మా ఫాదర్ అంటే నాకు చాలా ఇష్టం. తండ్రీకొడుకుల సెంటిమెంట్‌తో వచ్చిన ఈ చిత్రం నాకు చాలా చాలా నచ్చింది. సినిమా నచ్చబట్టే ఈ విజయోత్సవానికి వచ్చాను. క్లయిమాక్స్ అయ్యాక టూ మినిట్స్‌దాకా లేవలేదు. థిస్ ఈజ్ ది బెస్ట్ క్లయిమాక్స్. ఈ సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు, మా మెగాఫాన్స్‌కి నా ధన్యవాదాలు అన్నారు. దర్శకుడు రాకేష్ శశి మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా చూసాక చాలామంది కొన్ని వందల మెసేజ్‌లు పంపించారు. ఫస్ట్‌ఆఫ్‌లో కొడుకులు తండ్రిని ఎలా ప్రేమించాలి.. సెకండ్ ఆఫ్‌లో తండ్రి కొడుకుని వాడి ఇస్టానికి వదిలెయ్యాలి. అప్పుడే మంచి ప్రయోజకులు అవుతారు అని చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు. సినిమా చాలా బాగుంది. తండ్రీకొడుకుల కథతో జన్యున్‌గా మంచి సినిమాచేశారు అంటున్నారు. ఇలాంటి కథని నమ్మి సినిమా తీసిన సాయిగారికి చాలా థాంక్స్. అలాగే చిరంజీవిగారు ఎంతో సపోర్ట్‌చేశారు. కళ్యాణ్‌దేవ్‌ని మంచి కథతో లాంచ్ చెయ్యాలని ఈ కథ ఓకేచేసి మమ్మల్ని ఎంకరేజ్‌చేశారు. నేను ఏదైతే కథగా రాసుకున్నానో దానికి పదిరెట్లు మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. అలాగే కళ్యాణ్ కూడా ప్రతిదీ నేర్చుకొని నేచురల్‌గా పెర్ఫార్మ్‌చేశాడు. ఈ సినిమాకి వర్క్‌చేసిన ఆర్టిస్ట్, టెక్నీషియన్స్‌కి థాంక్స్. హర్షవర్ధన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగా చేశారు అన్నారు. హీరో కళ్యాణ్‌దేవ్ మాట్లాడుతూ.. వైజాగ్, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, రెండురోజులనుండి థియేటర్‌లో ప్రేక్షకుల రెస్పాన్స్ తెలుసుకోవడం కోసం టూర్‌కి వెళ్ళాం. వెరీ అమేజింగ్ రెస్పాన్స్ చాలా బాగుంది. ఈ ఎక్స్‌పీరియన్స్ లైఫ్‌లాంగ్ గుర్తుండిపోతుంది. ఫాదర్స్, స్టూడెంట్స్ చాలామంది మూవీ చూసి వెరీ హార్ట్ టచ్చింగ్ ఫిల్మ్ అని అప్రిషియేట్ చేస్తున్నారు. మురళీశర్మగారు ఎన్నో సలహాలు ఇచ్చి ఎంకరేజ్ చేశారు. మాళవిక వెరీగుడ్ పెర్‌ఫార్మర్. డైరెక్టర్ రాకేష్ మంచి కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అందరికీ ఈ సినిమా నచ్చుతుంది. వారాహి చలనచిత్రం బ్యానర్‌నుండి ఇంట్రడ్యూస్ అవడం లక్కీగా భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సాయిగారికి నా కృతజ్ఞతలు. బన్నీ మూవీ చూసి చాలా బాగుంది అని మెచ్చుకొని ఈ ఫంక్షన్‌కి వచ్చారు. మమ్మల్ని సపోర్ట్‌చేయడానికి వచ్చిన బన్నీకి చాలా థాంక్స్. మా విజేత చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు, మెగా ఫాన్స్‌కి నా ధన్యవాదాలు అన్నారు.