వివాదంలో సన్నీ బయోపిక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో మంచి గుర్తింపుతెచ్చుకున్న అడల్ట్ స్టార్ సన్నీలియోన్‌కి ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కాగా సన్నీలియోన్ జీవిత కథ ఆధారంగా ‘కరెన్జిత్‌కౌర్ - ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. కానీ ప్రస్తుతం ఈ చిత్రం కొన్ని ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది. తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం ఢిల్లీ సిక్కు గురుద్వార మేనేజ్‌మెంట్ కమిటీ (డి.యస్.జి.యమ్.సి) సన్నీ బయోపిక్‌లో ‘కౌర్’ టైటిల్ ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తుంది. ఈ వివాదాస్పద చిత్రంతో ‘కౌర్’ పరు వాడటం వల్ల, ‘కౌర్’కి సంబంధించిన వారి మనోభావాలను దెబ్బతింటాయని డి.యస్.జి.యమ్.సి. పేర్కొంది. మరి ఈ వివాదాన్ని నిర్మాతలు ఎలా హ్యాండిల్‌చేస్తారో చూడాలి. ఆదిత్యదత్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని వెబ్ సిరీస్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.