27న మోహిని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు ప్రేక్షకుల్లో తనదైన అందంతో అభినయంతో దశాబ్దకాలంగా టాప్ హీరోయిన్‌గా ఆకట్టుకున్న త్రిష తిరిగి మోహినిగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో మోహినిగా ఈ చిత్రం తెరకెక్కింది. అదే టైటిల్‌తో తెలుగులోకూడా రానుంది. ఈ చిత్రాన్ని వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ లక్ష్మిపిక్చర్స్ తెలుగులో విడుదల చేస్తున్నారు. ఎస్.లక్ష్మణ్‌కుమార్, శ్రీనివాసరావు పల్లెల, కరణం మధులతలు సంయుక్తంగా ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మాణం చేపట్టారు. ఆర్.మాదేష్ దర్శకుడు. హర్రర్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం తెరకెక్కింది. ఇటీవల విడుదలచేసిన ఈ చిత్రం ట్రైలర్ అందర్నీ ఆకట్టుకుంది. ఈ చిత్రంలో త్రిషతోపాటు జాఖీ, యోగిబాబు, పూర్ణిమా భాగ్యరాజ్ ముఖ్యపాత్రల్లో నటించారు. వివేక్-మెర్విన్ సంగీతం అందిస్తున్నారు. ఆర్.బి.గురుదేవ్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా వుంది. థింగ్ మ్యూజిక్ ద్వారా ఈ చిత్రం ఆడియోని విడుదల చేస్తున్నారు. అయితే ఈ ఆడియోని జూలై 19న విడుదల చేస్తారు. చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లో జూలై 27న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. త్రిషకి తెలుగులో వున్న క్రేజ్ అందరికీ తెలుసు. అయితే హర్రర్ చిత్రంగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న మోహిని చిత్రం ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాము. ఇప్పటికే విడుదలచేసిన ట్రైలర్‌కి మంచి క్రేజ్ రావటంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. విజువల్ గ్రాండియర్‌గా హర్రర్ బ్యూటీతో అందర్నీ అలరిస్తుంది. మాదేష్ చాలా మంచి కానె్సప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. త్రిష పెర్‌ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకుంటుంది అని అన్నారు. ఈ చిత్రంలో త్రిష, జాకి, యోగిబాబు, పూర్ణిమ భాగ్యరాజ్ తదితరులు నటిస్తున్నారు.