లేడీ ఓరియెంటెడ్‌లో అనుష్క?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాహుబలి, అరుంధతి లాంటి సినిమాలతో ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకున్న అందాల భామ అనుష్క ప్రధాన పాత్రలో మరో సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయి. భిన్నమైన సినిమాలతో దర్శకుడిగా ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్న చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే అనుష్కతో చర్చలు జరిపి ఆమెతో ఒప్పించాడు దర్శకుడు. అయితే ఈ సినిమాలో మరో కీలకపాత్రకోసం హీరో నానిని ఎంపిక చేశారట. ఈ కథ విని నచ్చడంతో నాని ఓకే చెప్పాడట. అనుష్క భాగమతి తరువాత నటించే మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా అనగానే ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సినిమా ఆగస్టులో సెట్స్‌పైకి వచ్చే అవకాశం ఉంది. భాగమతి తరువాత అనుష్క బరువుతగ్గే పనిలో పడింది. అందుకోసమే మరే సినిమాకు ఆమె ఓకే చెప్పలేదు. తాజాగా చంద్రశేఖర్ యేలేటి సినిమాలో నటిస్తోంది.