రెమ్యూనరేషన్ పెంచేసింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డీజే చిత్రంతో మంచి పాపులారిటీ తెచ్చుకుంది పూజాహెగ్డే అంతకుముందు ముకుంద, ఒక లైలాకోసం చిత్రాలతో రానంత ప్రచారం ఈ ఒక్క సినిమాతో వచ్చింది. బాలీవుడ్‌లో హృతిక్ సరసన నటించిన మొహంజోదారో తేలేని కొత్త ఇమేజ్‌ని డీజే తెచ్చింది ఈ ముంబై భామకు. అందుకే ఈ భామ ప్రస్తుతం టాలీవుడ్ కెరీర్‌ని ఛాలెంజింగ్‌గా తీసుకుని దూసుకుపోతోంది. ప్రస్తుతం బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సరసన సాక్ష్యం చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా రిలీజ్ బరిలో ఉన్న సంగతి తెలిసిందే. అసలు ఈ సినిమాకి పూజ భారీగా పారితోషికం డిమాండ్ చేసిందట. అడిగినంత ఇస్తేనే ఓకే, లేదంటే లేదని చెప్పడంతో నిర్మాతలు ఇచ్చుకోక తప్పలేదు. ఇక పూజా ప్రస్తుతం ఎన్టీఆర్ అరవింద సమేత, చరణ్ ఆర్.సి 12 చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. మరోవైపు ప్రభాస్ సరసన ఓ చిత్రంలో నటించేందుకు అంగీకరించింది. అవకాశాలు క్యూలో ఉండగానే యువ హీరోల సరసన అవకాశాల్ని పరిశీలిస్తోందిట. తనవరకూ భారీ పారితోషికం ముడితే పూజా నటించేందుకు ఎలాంటి అభ్యంతరం చెప్పడంలేదని తెలుస్తోంది. పెద్ద హీరోల సినిమాలకు ఎలానూ భారీగానే ముడుతోంది కాబట్టి అక్కడ ఆలోచించేదేం లేదు.