బ్రిటిష్ కాలంనాటి కథతో..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్ క్రేజీ దర్శకుడు రాజవౌళి బాహుబలి తరువాత తెరకెక్కించే సినిమాగా క్రేజీ మల్టీస్టారర్‌ని ఎంచుకున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్- రామ్‌చరణ్ హీరోలుగా నటించే ఈ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ పనులతోపాటు స్క్రిప్ట్‌వర్క్ కూడా జోరుగా జరుగుతుంది. ఈ సినిమాను నవంబర్‌లో మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు కథను సిద్ధంచేసే పనిలోపడ్డాడు రచయిత విజయేంద్రప్రసాద్. ఈ కథ గురించి చాలారకాల మల్లగుల్లాలు పడ్డప్పటికీ ఫైనల్‌గా బ్రిటిష్ కాలంనాటి కథ కుదిరిందట. అంటే 1947కి పూర్వం మనదేశాన్ని బ్రిటిష్‌వాళ్ళు పాలించేవాళ్ళు. ఆ నేపథ్యంలో ఈ కథను సిద్ధంచేసారని, అప్పటి నేపథ్యంలో ఉండేలా సెట్స్, కార్స్, బైక్ లాంటివి కూడా రూపొందిస్తారట. దీనికోసం ఓ ప్రత్యేక సెట్స్‌ని కూడా సిద్ధంచేయడానికి రెడీఅయ్యారు. ఏకంగా 300కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో ఓ హీరోయిన్‌గా కీర్తిసురేష్‌ని ఎంపికచేసినట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజానిజాలు ఎలా ఉన్నాయన్న విషయం తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.