కరణ్ జోహర్ సినిమాలో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ మహేష్‌బాబు సరసన భరత్ అనే నేను చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే తెలుగు సినిమాలతోపాటు అటు బాలీవుడ్ చిత్రాలలోనూ కైరా సినిమాలు చేస్తున్నారు. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్న బయోపిక్‌లో కైరా అద్వానీ నటించనుంది. వివరాల్లోకి వెళితే పరమవీర చక్ర బిరుదును పొందిన అమర జవాన్ విక్రమ్ బాత్రా జీవిత కథ ఆధారంగా కరణ్ జోహార్ ఓ సినిమా నిర్మిస్తున్నారు. సిద్ధార్థ్ మల్హోత్ర హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కైరా అద్వానీ ఓ కీలకమైన పాత్రలో నటిస్తోంది.