త్వరలో బ్రాండ్‌బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మారుతి సమర్పణలో శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రభాకర్ పి. దర్శకత్వంలో ఎస్.శైలేంద్రబాబు నిర్మిస్తోన్న చిత్రం బ్రాండ్ బాబు. దర్శకుడు మారుతి కథ అందించిన ఈ చిత్రంలో సుమంత్ శైలేందర్, ఈషా రెబ్బా, పూజిత పొన్నాడ హీరోహీరోయిన్స్‌గా నటించారు. మురళీశర్మ ముఖ్యపాత్రలో కనిపించబోతున్నారు. దర్శకుడు హరీశ్ శంకర్ విడుదల చేసిన బ్రాండ్‌బాబు టీజర్‌కు మంచి రెస్పాన్స్ లభించింది. త్వరలో ఆడియోను విడుదల చేయాలని నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఆగస్టు మొదటివారంలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో మారుతి స్టయల్‌లో హీరో క్యారక్టరైజేషన్ ఉండబోతోంది. ఎంటర్‌టైనర్‌గా అన్నివర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఈ సినిమాను తెరకెక్కిచారు దర్శకుడు ప్రభాకర్. సుమంత్ శైలేంద్ర, ఇషారెబ్బా, మురళీశర్మ, పూజిత పొన్నాడ, రాజారవీంద్ర, సత్యం రాజేష్, వేణు వై, నలీన్, పి.సాయికుమార్, కోటేష్ మన్నవ, కిరణ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరామెన్: కార్తీక్ ఫలణి, కథ: మారుతి, నిర్మాత: ఎస్.శైలేంద్ర, దర్శకత్వం: ప్రభాకర్ పి.