గోవాకు మహేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న 25వ సినిమా ఇటీవలే డెహ్రాడూన్‌లో షూటింగ్ జరుపుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్ మొదలైంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్‌రాజు, అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ రెండు పాత్రల్లో కనిపిస్తాడన్న విషయం తెలిసిందే. రైతు బిడ్డగానూ, మరోవైపు అమెరికాలో వుండే యువకుడిగా రెండు షేడ్స్ వున్న పాత్రల్లో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఇప్పటికే రాజసం అనే టైటిల్ పెడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే గోవా వెళ్లనుంది. అక్కడ కొంత షూటింగ్ జరిపి మళ్లీ హైదరాబాద్ తిరిగి వస్తారట. ఆ తరువాత హైదరాబాద్‌లో షూటింగ్ జరిపి తదుపరి షెడ్యూల్‌ని యూరప్‌లో చిత్రీకరిస్తారని నిర్మాత తెలిపారు. మహేష్ కెరీర్‌లో 25వ సినిమా కావడంతో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అల్లరి నరేష్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.