నా డబ్బింగ్ నచ్చితే కొనసాగిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజానికి ‘ఊపిరి’ సినిమా చేయడానికి సంవత్సరం పట్టింది. అలాగే ‘బాహుబలి’ సినిమా కూడా ఇంకెంత టైమ్ పడుతుందో తెలియదు. ఒకేసారి పది సినిమాల్లో నటించాలని కోరిక నాకు లేదు. నాకు నచ్చిన కథలతో నచ్చిన పాత్రలుంటే చేస్తా.

పరిచయ వాక్యాలు పెద్దగా అవసరం లేని హీరోయిన్‌గా గుర్తింపుతెచ్చుకుంది తమన్నా. దక్షిణాదిలో పలువురు టాప్ హీరోల సరసన నటించి ఆకట్టుకున్న ఈమె ‘బాహుబలి’ సినిమాతో అంతర్జాతీయ ఖ్యాతిని సొంతం చేసుకుంది. తాజాగా తమన్నా నటిస్తున్న చిత్రం ‘ఊపిరి’. నాగార్జున, కార్తి హీరోలుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పివిపి బ్యానర్ పతాకంపై ప్రసాద్ వి.పొట్లూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈనెల 25న విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా అందాల భామ తమన్నాతో ముఖాముఖి..
* ఇందులో మీ పాత్ర?
- ఈ సినిమాలో ఓ బిలియనీర్ పర్సనల్ అసిస్టెంట్ కీర్తి పాత్రలో కనిపిస్తాను. నేటి జనరేషన్‌కు తగ్గట్టుగా ఉండే అమ్మాయి. ముక్కుసూటితనం, ఎలాంటి బాధ్యతనైనా నెరవేర్చేగలిగే మొండి అమ్మాయి అని చెప్పొచ్చు. ఈ పాత్రలో కొత్త లుక్‌తో కనిపిస్తాను.
* ఒరిజినల్ సినిమా చూశారా?
- ‘ఊపిరి’ సినిమా ఫ్రెంచ్‌లో హిట్ అయిన ‘ఇన్‌టచబుల్స్’ చిత్రానికి రీమేక్. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా దీన్ని రూపొందించారు. నిజానికి ఇది రీమేక్ అనేకంటే అడాప్ట్ అని చెప్పాలి. ఇది చాలావరకు ఇండియన్ ఆడియన్‌కు నచ్చేలా తీర్చిదిద్దారు. అయితే ఒరిజినల్ సినిమాను నేను చూడలేదు. అలాగే, ఈ చిత్రంలో నా పాత్ర పరిధి పెంచారు.
* తెలుగులో డబ్బింగ్ చెప్పారు?
- ఔను. మొదటిసారి నా పాత్రకు నేనే చెప్పుకున్నాను. డబ్బింగ్ చెప్పాలన్న కోరిక ఎప్పటినుంచో వుంది. ఈ ఆలోచనను దర్శకుడు వంశీకి చెప్పడంతో ఆయన ఓకె అన్నారు. ఈ సినిమాలో నా వాయిస్ ప్రేక్షకులకు నచ్చితే ఖచ్చితంగా ఇకపై నా డబ్బింగ్ నేనే చెప్పుకుంటా.
* తమిళంలో కూడా మీరే డబ్బింగ్ చెప్పారా?
- లేదు. తమిళం నాకింకా పర్‌ఫెక్ట్‌గా రాలేదు కాబట్టి వేరేవారితో చెప్పించారు.
* నాగార్జునతో పనిచేయడం ఎలా వుంది? ఒకవేళ ఇలాంటి పాత్ర మీకొస్తే చేస్తారా?
- ఒక నటుడు సినిమా మొత్తం వీల్‌ఛైర్‌లో కూర్చుని వుండడం, నిజంగా కష్టమైన విషయం. శరీరంలో ఏ భాగం కదల్చకుండా కేవలం ఫేస్ ఎక్స్‌ప్రెషన్‌తో నటించాలంటే ఎంత కష్టమో నాగార్జునను చూస్తే తెలిసింది. నిజంగా ఆయన ఈ పాత్రలో అద్భుతంగా నటించాడు. నిజంగా నాకిలాంటి పాత్ర వస్తే తప్పకుండా చేస్తా. ఈ సినిమా చూసిన తరువాత తెలుగు హీరోల ఆలోచనా విధానం మారొచ్చు.
* కార్తితో పనిచేయడం?
- కార్తితో ఇదివరకే రెండు సినిమాలు చేశాను. తనలో నటుడు ఇంకా ఎంతో ఎదిగాడు. సాధారణంగా నటులంటే మెథడికల్‌గా లేదా స్పాంటేనియస్‌గా నటిస్తారు. కానీ కార్తి మాత్రం ఈ రెండింటినీ బాలెన్స్ చేసి అద్భుతమైన పెర్‌ఫార్మెన్స్ ఇచ్చాడు.
* ఈమధ్య సినిమా సినిమాకు గ్యాప్ ఎక్కువవుతోంది, కారణం?
- చాలామంది ఇదే అడుగుతున్నారు. నిజానికి ‘ఊపిరి’ సినిమా చేయడానికి సంవత్సరం పట్టింది. అలాగే ‘బాహుబలి’ సినిమా కూడా ఇంకెంత టైమ్ పడుతుందో తెలియదు. ఒకేసారి పది సినిమాల్లో నటించాలని కోరిక నాకు లేదు. నాకు నచ్చిన కథలతో నచ్చిన పాత్రలుంటే చేస్తా.
* బాహుబలి-2లో మీ పాత్ర?
- బాహుబలి-2లో నా పాత్ర ఉంటుంది. అది ఎంతసేపు అనేది తెలియదు. త్వరలోనే షూటింగ్‌లో పాల్గొనాలి.
* స్పెషల్ సాంగ్స్ ఇంకా చేస్తున్నారా?
- స్పెషల్ సాంగ్స్‌లో నటించమని అవకాశాలు వచ్చినపుడు నచ్చితే నటిస్తాను. అంతేకానీ వాటికోసం అంటూ ప్రత్యేకంగా ఎదురుచూడను.
* నెక్స్ట్ ప్రాజెక్ట్స్?
- ప్రస్తుతం ఓ తమిళ్ సినిమా చివరిదశలో వుంది. దాంతోపాటు ప్రభుదేవా హీరోగా తమిళ, తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న మరో చిత్రంలో నటిస్తున్నాను. దాంతోపాటు కొన్ని చర్చల దశలో ఉన్నాయి.

-శ్రీ