నర్తనశాల ఫస్ట్‌లుక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఛలో లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రం తరువాత నాగశౌర్య, ఐరా క్రియేషన్స్ కాంబినేషన్‌లో ప్రొడక్షన్ నెం-2గా తెరకెక్కుతున్న చిత్రం నర్తనశాల ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్స్ కష్మిర పరదేశి, యామిని భాస్కర్, శివాజీరాజా, జెమిని సురేష్, రాఘవ, రాకెట్ రాఘవ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ దగ్గర దర్శకత్వశాఖలో పనిచేసిన శ్రీనివాస చక్రవర్తి దర్శకుడు, చిత్ర సమర్పకుడు శంకరప్రసాద్ ముల్పూరి, చిత్ర నిర్మాత ఉష ముల్పూరి. ఈ సందర్భంగా హీరో నాగశౌర్య మాట్లాడుతూ... నర్తనశాల చిత్రం షూటింగ్ మొత్తం పూర్తిచేశాం. లెజెండరీ చిత్రం నర్తనశాల పేరు ఏమాత్రం పాడుచేయకుండా నిలబెట్టేలా మా చిత్రాన్ని చేశాం. అలాగే మా దర్శకుడు శ్రీనివాస్‌గారు చాలాబాగా చేశారు. నర్తనశాల ఫ్రెష్‌లుక్ చూశారుగా అందరికీ నచ్చిందిగా.. ఇలానే మా చిత్రం కూడా అందర్నీ ఎంటర్‌టైన్ చేస్తుంది. త్వరలో మరింత ప్రమోషన్‌తో మీముందుకు వస్తాం అన్నారు. నిర్మాత ఉషా మూల్పురి మాట్లాడుతూ.. ఛలో చిత్రాన్ని ఎంత ఘనవిజయం చేశారో మా నర్తనశాలని కూడా అంతకుమించి విజయం చెయ్యాలని కోరుకుంటున్నాను. ఈ చిత్రం తప్పకుండా అందర్నీ ఎంటర్‌టైన్ చేస్తుంది అని అన్నారు. దర్శకుడు శ్రీనివాస్ చక్రవర్తి మాట్లాడుతూ.. నర్తనశాల చిత్రం చాలా బాగా వచ్చింది. దీనికి ముఖ్య కారణం మా హీరో నాగశౌర్య. పాత్రలోని ఇన్‌వాల్వ్ అయి చేశాడు. ఫస్ట్‌లుక్‌ని చూశారుగా ఈ చిత్రం కూడా అదే రేంజ్‌లో వుంటుంది. ఇక మా నిర్మాతలు శంకర్, ఉష, బుజ్జిగారు వీరంతా నా ఫ్యామిలీ మెంబర్స్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఫ్యామిలీకి సినిమా అంటే ఫ్యాషన్ ఈ బ్యానర్‌లో ఏ చిత్రం వచ్చినా అది బ్లాక్‌బస్టర్ ఖాయం అని అన్నారు. హీరోయిన్ కష్మిరా మాట్లాడుతూ.. నాగశౌర్య చాలా మంచి నటుడు. ఈ చిత్రం అందరినీ పది మెట్లు ఎక్కిస్తుంది. చాలా మంచి చిత్రంతో పరిచయమవుతున్నందుకు చాలా ఆనందంగా వుంది అన్నారు. ఈ చిత్రానికి కథ- స్క్రీన్‌ప్లే- మాటలు- దర్శకత్వం: శ్రీనివాస్ చక్రవర్తి. నిర్మాత: ఉష మూల్పురి, లైన్ ప్రొడ్యూసర్: బుజ్జి, సంగీతం: మహతి స్వరసాగర్, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, తమ్మిరాజు.

చిత్రం .. నాగశౌర్య