ఫిలింసిటీలో బాహుబలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బాహుబలి’.. దర్శక ధీరుడు రాజవౌళి రూపొందించిన ఈ విజువల్ వండర్ దేశ వ్యాప్తంగా ఏ స్థాయి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా చివర్లో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అన్న సస్పెన్స్‌ను అలాగే దాచిపెట్టిన రాజవౌళి, ఆ సస్పెన్స్ కోసం బాహుబలికి రెండో భాగమైన ‘బాహుబలి ది కంక్లూజన్’ వచ్చేవరకూ ఎదురుచూడమని చెప్పారు. ప్రస్తుతం రాజవౌళి ఆ సస్పెన్స్‌ను రివీల్ చేసేందుకు ‘బాహుబలి-2’ను పూర్తిచేసే పనిలో బిజీ బిజీగా వున్నారు. కొద్దిరోజుల వరకూ అల్యూమినియం ఫ్యాక్టరీ పరిసరాల్లో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరగ్గా, తాజాగా టీమ్ మళ్లీ రామోజీ ఫిల్మ్ సిటీకి షిప్ట్ అయింది. రామోజీ ఫిల్మ్‌సిటీలోనే బాహుబలి సినిమాకు సంబంధించిన మేజర్ షూటింగ్ పార్ట్ జరగ్గా, ఇపుడు బాహుబలి-2 కూడా ఎక్కువ భాగం ఇక్కడే షూటింగ్ జరుపుకోనుంది. ఫిల్మ్ సిటీలో ఈ సినిమా కోసం వేసిన భారీ సెట్స్‌లో ప్రస్తుతం పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక మరి కొన్నాళ్లపాటు టీమ్ ఇక్కడే షూటింగ్ జరపనుంది. ప్రభాస్, అనుష్క తదితరులు ప్రస్తుతం ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల కానున్న ఈ సినిమాను మొదటి భాగం కంటే అన్ని విధాలా మెరుగ్గా ఉండేలా రాజవౌళి ‘బాహుబలి-2’ను సిద్ధం చేస్తున్నారు.