బిచ్చగాడా మజాకా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎస్.ఎ.రెహమాన్ సమర్పణలో ఆల్ వెరైటీ మూవీ మేకర్స్ పతాకంపై ప్రముఖ దర్శకుడు కె.ఎస్.నాగేశ్వరరావు దర్శకత్వంలో బి.చంద్రశేఖర్ (పెదబాబు) నిర్మిస్తున్న వినూత్న కథా చిత్రం ‘బిచ్చగాడా మజాకా’- ఏ బ్రేకప్ లవ్‌స్టోరీ అన్నది ట్యాగ్‌లైన్. అర్జున్‌రెడ్డి, నేహాదేశ్‌పాండే హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో బాబూమోహన్, సుమన్, ధన్‌రాజ్, చిత్రం శ్రీను, అపూర్వ, బాలాజీ, డి.ఎస్.రావు, తుమ్మల రామసత్యనారాయణ ముఖ్యపాత్రలు పోషించారు. శ్రీవెంకట్ సంగీత సారథ్యం వహించిన ఈ చిత్రం ఆడియో హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ థియేటర్‌లో ఘనంగా జరిగింది. సుప్రసిద్ధ ఆడియో కంపెనీ ఆదిత్య మూజిక్ ద్వారా పాటలు ఆన్‌లైన్‌లో లభ్యం కానున్నాయి. ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించడంతోబాటు ఈ చిత్రంలో టైటిల్ సాంగ్ ఆలపించిన ప్రముఖ నటుడు, శాసనసభ్యులు బాబుమోహన్ ఈ చిత్రం ఆడియోను ఆవిష్కరించారు. దీనికి ముందు నాలుగు పాటలు, ట్రైలర్ విడుదల చేసి ప్రదర్శించారు. ఈ సందర్భంగా బాబూమోహన్ మాట్లాడుతూ- చంద్రశేఖర్ అన్నీ తానే అయి దర్శకుడు కె.ఎస్.నాగేశ్వరరావునుంచి చాలా మంచి అవుట్‌పుట్ తీసుకున్నారు. ఈ చిత్రం మంచి హిట్ అవుతుందన్నారు. కథ, మాటలు, పాటలు సమకూర్చిన నిర్మాత బి.చంద్రశేఖర్ మాట్లాడుతూ- బిచ్చగాడా మజాకా రొటీన్ స్టోరీ కాదు. బిచ్చగాళ్ళు లేని సొసైటీ కోసం ఒక యువకుడు చేసిన పోరాటం ఏ విధమైన మలుపులు తిరిగింది? అది అతని ప్రేమకథను ఏ విధంగా ప్రభావితం చేసింది? అనే కథాంశంతో రూపొందించాం అన్నారు. చిత్ర దర్శకుడు కె.ఎస్.నాగేశ్వరరావు మాట్లాడుతూ- చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం చాలా పెద్ద సినిమా అవుతుంది. బాబుమోహన్ సహాయ సహకారాలు మురువలేనివి. ఆగస్టులో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. ఈ చిత్రం తమ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తుందని అర్జున్‌రెడ్డి, నేహా దేశ్‌పాండే అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర సమర్పకులు ఎస్.ఎ.రెహమాన్, నిర్మాత బి.చంద్రశేఖర్, అర్జున్‌రెడ్డి, నేహాదేశ్‌పాండే, బాలాజీ, డి.ఎస్.రావు, సంగీత దర్శకుడు శ్రీవెంకట్, కెమెరామెన్ అడుసుమిల్లి విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.